Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం విమానాశ్రయం.. 99.3% పనులు పూర్తి!

భోగాపురం విమానాశ్రయం.. 99.3% పనులు పూర్తి!

వార్త 3 weeks ago

త్తరాంధ్ర రూపురేఖలను మార్చేయబోతున్న ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. శుక్రవారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ ఉత్తరాంధ్ర ప్రముఖ నాయకులు పి.వి.ఎన్. మాధవ్‌తో కలిసి విమానాశ్రయ నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

99.3 శాతం పనులు పూర్తి.. ప్రారంభానికి కౌంట్‌డౌన్!

విమానాశ్రయానికి సంబంధించిన రన్‌వే, చెక్-ఇన్ ఏరియా, లగేజ్ కౌంటర్లు, మరియు అత్యాధునిక ఇంటీరియర్ వర్క్స్ (Interior Works) పనులను కేంద్రమంత్రి అంగుళం అంగుళం పరిశీలించారు. ప్రస్తుతం విమానాశ్రయానికి సంబంధించిన 99.3 శాతం పనులు విజయవంతంగా పూర్తయినట్లు జీఎమ్‌ఆర్ (GMR) సంస్థ ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన స్వల్ప పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

Bhogapuram International Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్!

పనుల పరిశీలన అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాదు.. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతపు భవిష్యత్తును మార్చే ఒక గేమ్ ఛేంజర్. అంతర్జాతీయ స్థాయి వసతులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని తీర్చిదిద్దుతున్నాం. అతి త్వరలోనే ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా, పర్యాటకంగా మరియు ఐటీ రంగంలో అభివృద్ధి వైపు మరింత బలంగా, వేగంగా అడుగులు వేస్తుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజల దశాబ్దాల కల నెరవేరడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో జీఎమ్‌ఆర్ ప్రతినిధులు, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

డిజిటల్ మహానాడుకు టీడీపి ప్లాన్.. మంగళగిరిలో చంద్రబాబు హైటెక్ ఏర్పాట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha