Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూ తగాదాతో చౌటకూర్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

భూ తగాదాతో చౌటకూర్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

వార్త 4 days ago

మృతుడి జేబులో సుసైడ్ నోట్

Choutukur Crime: భూ తగాదాతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన చౌటకూర్లో జరిగిం ది. గ్రామానికి చెందిన పంతులు శ్రీశైలం 1991లో అదే గ్రామానికి చెందిన బుర్కల రాఘవులు వద్ద సర్వే నంబరు 6లో 6 గుంటల పట్టా భూమిని సాదా బైనామా (తెల్లకాగితం) పై కొనుగోలు చేశాడు.

ఆ భూమి గ్రామానికి అనుకుని ఉండటంతో పంతులు శ్రీశైలం ఇంటిని నిర్మించుకుని, పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయించుకున్నాడు. అయితే, సాదా బైనామాపై కొనుగోలు చేసిన భూమిని శ్రీశైలం తన పేరున మార్చుకోలేదు.

Read Also: Atlanta Kerala Couple Helicopter Crash:పెళ్లయిన 10 గంటలకే హెలికాప్టర్ ప్రమాదం.. కేరళకు చెందిన వరుడు మృతి!

 Man commits suicide by hanging himself in Chautakur over land dispute

Choutukur Crime: ఇరు కుటుంబాల మధ్య భూ వివాదం

అనంతరం బుర్కల రాఘవులు మృతి చెందగా, ఆయన కుమారులు ఆ భూమి తమదని, తమ తల్లీ పేరున రికార్డుల్లో నమోదై ఉన్నదని, ఖాళీ చేయాలంటూ పలు మార్లు హెచ్చరిస్తూ, గొడవలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా, శ్రీశైలం కుమారులు పంతులు గణేష్, రాజులు హాజరై తమ తండ్రి 36 ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశారని వాదించారు. న్యాయంగా శ్రీశైలంకే ఆ భూమి దక్కుతుందని పెద్దలు చెప్పినప్పటికీ, బుర్కల రాఘవులు కుమారులు వినకపోవడంతో మొండికేశారు.

వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

కష్టపడి కొనుగోలు చేసిన భూమి తనకు దక్కకుం డా పోతుందని కలత చెందిన పంతులు శ్రీశైలం ఆదివారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం కావస్తున్నప్పటికీ, ఎంతకు తిరికి రాకపోవడంతో బందువులు, వ్యవసాయ పొలాల వద్ద వెతికారు. సోమవారం ఉదయం వ్యవసాయ పొలాల వద్ద వెతుకుతుండగా, గ్రామానికి చెందిన పల్నాటి హరిశంకర్ గౌడ్ వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

కాగా, ఘటనా స్థలాన్ని తహసీల్దార్ నామాల కిష్టయ్య, రెవెన్యూ గిర్దావర్ ప్రమోద్ కుమార్, పుల్కల్ ఎస్ఐ నల్లా విశ్వజన్లు సందర్శించారు. మృతదేహనికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టానికి సంగారెడ్డికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత కుండా గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతుడు పంతులు శ్రీశైలం జేబులో సుసైడ్ నోట్ లభ్యమైం ది. జేబులో దొరికిన సుసైడ్ నోట్ను ఎస్ఐ నల్లా విశ్వజన్ స్వాధీనం చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కేరళను కుదిపేస్తున్న పసికందు హత్య ఉదంతం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha