Ground water : నీటి సంక్షోభం అంటే నదులు ఎండిపోవడం, చెరువులు ఖాళీ కావడం మాత్రమే కాదు. నేల అడుగున నిశ్శబ్దం గా తగ్గిపోతున్న భూగర్భ జలాలు కూడా తీవ్రమైన హెచ్చ రిక.
ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం 2026 జనవరిలో విడుదల చేసిన ప్రపంచ జల అధ్యయనం ప్రకారం ప్రపం చంలోని ప్రధాన భూగర్భ జలాశయాల్లో దాదాపు 70 శాతం దీర్ఘకాలిక క్షీ ణతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ గృహ అవసరాలకు ఉపయోగించే నీటిలో సుమారు సగం భూగర్భ జలాల నుంచేవస్తోంది. సాగునీటికి ఉపయోగించే నీటిలో 40శాతానికి పైగా భూగర్భజలాలపై ఆధారపడు తోంది. అధికంగా నీటిని వెలికితీయడం వల్ల భూమి దిగ జారే ప్రమాదం కూడా పెరుగుతోంది. భూగర్భ జలాల అధిక వినియోగంతో ముడిపడిన భూమి దిగజారే ప్రభా వం ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరిం చినట్లు అధ్యయనం పేర్కొంది. దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలు అటువంటి ప్రభావ పరిధిలో ఉన్నట్లు నివే దిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సరస్సుల్లో సగం 1990ల ప్రారంభం నుంచి నీటి నష్టాన్ని ఎదుర్కొ న్నట్లు అధ్యయనం వెల్లడించింది. సహజంగా తిరిగి నిండే వేగాన్ని మించి భూగర్భ జలాలను వినియోగిస్తే భవిష్యత్ తరాలపై నీటి భారం మరింత పెరిగే అవకాశం ఉంది. భారతదేశ పరిస్థితిని కేంద్ర భూగర్భ జల మండలి 2025 అంచనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
Ground water
Ground water : జల పునఃనింపుదల
దేశవ్యాప్తంగావార్షిక భూగర్భ జల పునఃనింపుదల పరిమాణం 448.52 బిలి యన్ ఘనపు మీటర్లు. వినియోగానికి అందుబాటులో ఉన్న వార్షిక వనరు 407.75 బిలియన్ ఘనపు మీటర్లు, వార్షిక భూగర్భ జల వెలికితీత 247.22 బిలియన్ ఘనపు మీటర్లు. దేశ స్థాయి భూగర్భ జల వినియోగ దశ 60.63 శాతంగా నమోదైంది. తెలంగాణలో వార్షిక భూగర్భ జల పునఃనింపుదల పరిమాణం 21.93బిలియన్ మనపు మీటర్లు కాగా, వినియోగానికి అందుబాటులో ఉన్న వనరు 19.84 బిలియన్ ఘనపు మీటర్లు. వార్షిక వెలికితీత 9.26 బిలియన్ ఘనపు మీటర్లు. వినియోగ దశ 46.69 శాతం గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో పునఃనింపుదల పరిమాణం 26.34 బిలియన్ ఘనపు మీటర్లు. వినియోగానికి అందు బాటులో ఉన్న వనరు 25.02 బిలియన్ ఘనపు మీటర్లు. వార్షిక వెలికితీత 7.88 బిలియన్ ఘనపు మీటర్లు. విని యోగ దశ 31.51 శాతంగా ఉంది. తెలంగాణ తాజా పర్యవేక్షణ గణాంకాలు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. 2026 ఆగస్టులో రాష్ట్రనగటు భూగర్భ జలమట్టం భూమి ఉపరితలం నుంచి 7.87 మీటర్ల లోతులో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 1,771పర్యవేక్షణ కేంద్రాల ద్వారా జల మట్టాలను పరిశీలించారు. జూలైతో పోలిస్తే ఆగస్టులో సగ టున 1.61మీటర్ల మెరుగుదల కనిపించింది. 27 జిల్లాల్లో జలమట్టం పైకివచ్చింది. అయితే 2025 ఆగస్టుతో పోలిస్తే రాష్ట్ర సగటు జలమట్టం 2.09 మీటర్లు దిగజారింది. 30 జిల్లాల్లో క్షీణత నమోదైంది. కాబట్టి ఒక నెలలోకనిపించిన మెరుగుదల కంటే దీర్ఘకాలిక జలమట్టాల ధోరణినే ప్రధా నంగా పరిశీలించాలి.
Ground water
సహజ నీటిచొరబాటు ప్రాంతాలు తగ్గకుండా చూడటం
వర్షం పడటం ఒక్కటే భూగర్భ జల భద్రతకు హామీ కాదు. వర్షపు నీటిలో ఎంత భాగం నేల లోకి చేరుతోంది అన్నదే కీలక ప్రశ్న. తెలంగాణలో 2026 రుతుపవన కాలంలో వర్షపాతం ప్రాంతాలవారీగామారింది. సెప్టెంబర్ 1నాటికి రాష్ట్రంలో 473.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా 5812 మిల్లీ మీటర్లు ఉండాల్సిన స్థాయితో పోలిస్తే 18 శాతం లోటునమోదైంది. 33 జిల్లాల్లో 17జిల్లాలు లోటు వర్షపాతం వర్గంలో ఉండ గా 16 జిల్లాలు సాధారణ వర్గంలో ఉన్నాయి. ఆగస్టులో 134.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, సాధారణ215.8 మిల్లీమీటర్లతో పోలిస్తే 3 శాతం లోటు కనిపించింది. అయితే వరపాతంలోటు ఒక్కటే భూగర్భ జలాల క్షీణతకు కారణమని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు. వర్షపు నీరు నేలలోకి చొచ్చుకెళ్లే సామర్థ్యం, భూమి స్వభావం, బోర్ల వినియోగం, సాగు విధానం, పట్టణీకరణ, సహజ జలమార్గాల పరిస్థితి వంటి అనేక అంశాలు జలమట్టాలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఎంత వర్షం పడింది అన్న దానితో పాటు ఎంత నీరు నేలలోకి చేరింది, ఎంత నీరు వెలికితీశారు అన్న లెక్క కూడా అవసరం. నగర విస్తరణతో సహజ నీటిచొరబాటు ప్రాంతాలు తగ్గకుండా చూడటం భూగర్భ జలభద్రతలో కీలక అంశం. బోర్ల లోతు కాదు.. జల భద్రతే ముఖ్యం! భూగర్భ జలాల సమస్యకు మరింత లోతైన బోర్లు మాత్రమే పరి ష్కారం కావు. వర్షపు నీటిని నిల్వ చేయడం, చెరువులను పునరుద్ధరించడం, కుంటలను కాపాడటం, చెక్ డ్యామ్లు, పర్కొలేషన్ ట్యాంకులు, నీటిని నేలలోకి చేర్చే బావులు నిర్మించడం, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ వ్యవ స్థలను బలోపేతం చేయడం అవసరం. కేంద్ర ప్రభుత్వం కూడా నీటి సంరక్షణ, కృత్రిమ భూగర్భ జల పునఃనింపు దల, వర్షపు నీటి సేకరణకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఒక ప్రాంతంలో పనిచేసిన విధానాన్ని మరో ప్రాంతానికి యథాతథంగా వర్తింపజేయ డం కంటే స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి. ప్రజలు, రైతులు, పరిశ్రమలు, పట్టణ సంస్థలు, స్థానికసంస్థలు భాగస్వాములు కావాలి.
-ఫిరోజ్ ఖాన్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
రూ.7 ఎక్కువ తీసుకున్నందుకు రూ.7లక్షల ఫైన్ కట్టాల్సి వచ్చింది !!

