Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి".. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన

"బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి".. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన

వార్త 2 months ago

YSRCP Protest Tirupati: తిరుపతిలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శనివారం (ఏప్రిల్ 4, 2026) రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

ఈ క్రమంలో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also:IPS Sunil Kumar RRR Controversy: రఘురామ కృష్ణంరాజుపై విరుచుకుపడ్డ సునీల్ కుమార్.. వ్యక్తిగత విమర్శలపై ఫైర్

గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు

తిరుపతి వైసీపీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ముందుగా తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద అభినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని, ప్రస్తుత చైర్మన్‌ను తొలగించాలని గంగమ్మను వేడుకున్నారు.బీఆర్ నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలు లేదా ఆయన నియామకం హిందూ ధర్మ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

YSRCP Protest Tirupati: పోలీసుల ఆంక్షలు - గృహ నిర్బంధాలు

నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడానికి పోలీసులు భారీగా మోహరించారు.నిరసనలో పాల్గొనకుండా వైసీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు.పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు భూమన అభినయ్ రెడ్డి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha