BRS Ex MLA Rega Kantha Rao: తెలంగాణ రాజకీయాలో తీవ్ర కలకలం రేగుతోంది. బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తీవ్రమైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
బాధితురాలైన ఒక యువతి అందించిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి ఆయినపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Read Also :Peddi Sudarshan Reddy Death: పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి
ఫిర్యాదులోని ప్రధాన ఆరోపణలు

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, లైంగికంగా వేధించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరించారని తీవ్ర స్థాయిలో ఆరోపించింది.
BRS Ex MLA Rega Kantha Rao: BNS నిబంధనల ప్రకారం కేసు నమోదు
యువతి ఇచ్చిన ఆధారాలు మరియు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు:
- సెక్షన్ 69 (Section 69 BNS): పెళ్లి లేదా ఉద్యోగం ఇప్పిస్తామని మోసపూరిత వాగ్దానాలు చేసి లైంగిక సంబంధం పెట్టుకోవడం.
- సెక్షన్ 351(2) [Section 351(2) BNS నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం (Criminal Intimidation).
కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో పాటు ఆరోపణల నిజానిజాలపై పూర్తిస్థాయి దర్యాప్తు వేగవంతం చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపిన కల్వకుంట్ల కవిత

