Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిఆర్ఎస్ నేతలు అష్టదరిద్రులు అంటూ సీఎం రేవంత్ విమర్శలు

బిఆర్ఎస్ నేతలు అష్టదరిద్రులు అంటూ సీఎం రేవంత్ విమర్శలు

వార్త 2 months ago

CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని లేదా అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనార్థం తాము చేపట్టే ప్రతి ప్రాజెక్టుపై రాజకీయం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన ఇలాంటి వారిని “అష్టదరిద్రులు” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంబోధించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

Read Also : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కారు తోయడానికి కూడా ఎవరూ దొరకరు.. మూసీ దొర్లినా అభివృద్ధి ఆగదు!

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు తమ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, చివరకు వారి పార్టీ గుర్తు అయిన ‘కారు’ను తోయడానికి కూడా ఒక్కరు కూడా మిగలరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేస్తూ.. “మా కాళ్లలో కట్టెలు పెట్టినా, ఎంతలా పెడబొబ్బలు పెట్టినా, చివరకు మూసీ నదిలో పడి దొర్లినా సరే.. తెలంగాణ ప్రగతి ప్రస్థానం మరియు మూసీ పునరుజ్జీవన అభివృద్ధి పనులు ఆగే ప్రసక్తే లేదు” అని ఆయన అత్యంత ఘాటుగా తేల్చి చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. సిట్ విచారణ తర్వాత కేసీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha