KTR's farmhouse : రంగారెడ్డి జిల్లా పరిధిలోని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫామ్‌హౌస్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అక్కడికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు పెరిగింది. ఫామ్‌హౌస్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు ఫామ్‌హౌస్ దిశగా రాకుండా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించిన పలువురు కీలక నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Ponguleti Srinivas Reddy: సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు: మంత్రి పొంగులేటి
KTR’s farmhouse
KTR’s farmhouse : శాంతిభద్రతల పరిరక్షణపై డీసీపీ హెచ్చరిక
పరిస్థితిని సమీక్షించేందుకు రంగంలోకి దిగిన చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ అక్కడ ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. ప్రాంతంలో ఎలాంటి శాంతి భద్రతల (Law and Order) సమస్యను సృష్టించవద్దని, పోలీసుల విధులకు సహకరించాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల సర్వే మరియు వివాదాస్పద అంశాలపై ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్గాలు అక్కడకు చేరుకునేందుకు యత్నించాయి. పోలీసులు సమయానుకూలంగా స్పందించి పరిపరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

