సువేందు అధికారిని ఆహ్వానిస్తూ వీడియో
Gurugram woman arrested: హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర వివాదానికి దారితీసింది.
ఆ వీడియోలో ఆమె వంటగదిలో వంట చేస్తూ బెంగాలీ భాషలో మాట్లాడింది. తాను బీఫ్ (గోమాంసం) వండుతున్నానని, దానితో పాటు రొట్టెలు కూడా సిద్ధం చేశానని చెబుతూ.. బంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని భోజనానికి ఆహ్వానించింది. అంతేకాకుండా ఈద్ పండుగ రోజు విధించిన ఆంక్షల గురించి కూడా ఆమె ఆ వీడియోలో ప్రస్తావించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గురుగ్రామ్ పోలీసులు, మే 30న ఆ మహిళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆమెకు జూన్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Read Also: Immigrant votes : బంగ్లాకు తరలిపోతున్న వలస ఓట్లు!
Gurugram woman arrested
Gurugram woman arrested: బెయిల్ పిటిషన్ తిరస్కరణ
జూన్ 2న ఆ మహిళ తన న్యాయవాది ద్వారా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దానిని నిరాకరించింది. సదరు మహిళ వేరే రాష్ట్రానికి చెందినదని, ఒకవేళ ఆమెకు బెయిల్ ఇచ్చి విడుదల చేస్తే నగరం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, అలాగే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో వాదించారు. ఈ వీడియో వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై పోలీసులు మరింత దర్యాప్తు జరుపుతున్నారు. బంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సువేందు అధికారి గోమాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బక్రీద్ సహా ఇతర రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో జంతు వధను పూర్తిగా నిషేధించారు. ఆవులు, ఎద్దులు, గేదెలను వధించాలంటే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష లేదా రూ.1,000 జరిమానా విధిస్తామని నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను హైకోర్టు సమర్థించింది.

