Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిగ్ బాస్ 10లోకి హీరో అబ్బాస్?

బిగ్ బాస్ 10లోకి హీరో అబ్బాస్?

వార్త 2 weeks ago

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫస్ట్ ప్రోమో విడుదల కాగా, ఈ సీజన్‌కు కూడా అక్కినేనినాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నట్లు ప్రోమో ద్వారా స్పష్టమైంది.

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ పదో సీజన్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఈ షో సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సరికొత్త సీజన్‌లో ఒకప్పటి నటుడు అబ్బాస్ అడుగుపెట్టబోతున్నారనే వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Also : Spider-Man: Brand New Day : 'స్పైడర్ మాన్ : బ్రాండ్ న్యూ డే' మూడు రోజుల కలెక్షన్స్

 Actor Abbas to enter Bigg Boss 10?

Bigg Boss Telugu 10: న్యూజిలాండ్ నుండి రీఎంట్రీ వరకు.. అబ్బాస్ ప్రయాణం

'ప్రేమదేశం' సినిమాతో అప్పట్లో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో అబ్బాస్, ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఇటీవల మళ్లీ నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన అబ్బాస్, ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ టీమ్ ఇప్పటికే అబ్బాస్‌ను సంప్రదించిందని, ఆయన కూడా షోలోకి రావడానికి ఆసక్తి చూపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై బిగ్ బాస్ యాజమాన్యం గానీ, అబ్బాస్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజంగానే అబ్బాస్ బిగ్ బాస్ 10 హౌస్‌లో సందడి చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

హీరోగా దేవి శ్రీ ప్రసాద్.. 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha