Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2పై వివాదం.. సామాన్యుల అవమానంపై నెటిజన్ల ఫైర్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2పై వివాదం.. సామాన్యుల అవమానంపై నెటిజన్ల ఫైర్

వార్త 1 month ago

Agni pareeksha 2: స్టార్ మా మరియు జియో హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో 'అగ్నిపరీక్ష 2' ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుంది.

ఈ షోలో ప్రదర్శిస్తున్న కొన్ని అంశాలు సామాన్యుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వారిని తీవ్రంగా అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైరల్ వీడియో వెనుక అసలు నిజాలు

ఇటీవల ఈ షోకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో కంటెస్టెంట్లను అత్యంత దయనీయ రీతిలో రెండు బస్సుల్లో ఇరికించి తరలించడం, కొందరికి గాయాలు కావడం వంటి దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఒక్క మంచి అవకాశం కోసం ఆశతో వచ్చిన సాధారణ ప్రజలను ఇలాంటి ఇబ్బందులకు గురిచేయడం పట్ల ప్రేక్షకులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Agni pareeksha 2: నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత

జీవితంలో ఒక అడుగు ముందుకు పడాలనే ఆశతో వచ్చే సామాన్యుల బలహీనతలను, ఆశలను ఇలాంటి షోల ద్వారా ఆటపట్టించడం ఎంతవరకు సముచితమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వినోదం పేరుతో మనుషుల ప్రాణాలతో, ఆత్మగౌరవంతో చెలగాటమాడటం సరికాదని మండిపడుతున్నారు. తక్షణమే నిర్వాహకులు దీనిపై స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం.. జానీ మాస్టర్‌పై చర్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha