Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిహార్‌లో కరోనా కలకలం.. దంపతులకు కోవిడ్ పాజిటివ్

బిహార్‌లో కరోనా కలకలం.. దంపతులకు కోవిడ్ పాజిటివ్

వార్త 2 weeks ago

Bihar Covid Cases బిహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో కొత్తగా రెండు కోవిడ్-19 కేసులు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు అనారోగ్యానికి గురికావడంతో వారికి ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల ఫలితాల్లో వారిద్దరికీ కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స

ప్రస్తుతం బాధితులిద్దరినీ భాగల్పూర్‌లోని జేఎల్‌ఎన్‌ఎమ్‌సీహెచ్ (JLNMCH) ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సర్పంచ్ కల కోసం 63 ఏళ్ల వయసులో టెన్త్ పాస్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha