Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిహార్‌లో రాజకీయ మార్పులు

బిహార్‌లో రాజకీయ మార్పులు

వార్త 2 months ago

Bihar New CM : బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

రాజీనామాకు ముందు ఉదయం 11 గంటలకు చివరి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేయనున్నారు.

కొత్త సీఎం ఎంపికకు ఎన్డీయే సమావేశం

రాజీనామా అనంతరం సాయంత్రం 4 గంటలకు పాట్నాలో ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బిహార్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సామ్రాట్ చౌదరి పేరు ముందంజలో

బీజేపీ హైకమాండ్ కూడా సామ్రాట్ చౌదరికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయనకు సీఎం పదవి రాకపోతే కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది.

Read Also : Singer Mangli Scam : గోకుల నందన ఇన్ఫ్రా పెట్టుబడి వివాదం

 Bihar New CM

అసెంబ్లీ బలం ఎన్డీయేకే

బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అందులో ఎన్డీయే కూటమికి 202 మంది సభ్యుల బలం ఉంది. అందుకే ఈసారి బీజేపీ నేతకు సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాల ప్రభావం

గత ఏడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైపోయింది. కాంగ్రెస్ మాత్రం 6 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో బిహార్‌లో మొదటిసారిగా బీజేపీ నేత సీఎం అయ్యే అవకాశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏరోస్పేస్ రంగంలో సరికొత్త మైలురాయి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha