Ramachander Rao House Arrest: నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై దాడి ఘటనను పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.
రామచంద్రరావును పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. నల్లగొండ పర్యటనకు అనుమతి లేదని పేర్కొంటూ ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీజేపీ శ్రేణుల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Read Also :Konda Surekha: మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు?

Ramachander Rao House Arrest:పరామర్శ పర్యటన అడ్డుకట్ట.. అసలేం జరిగింది?
సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడి, ఆయన కుటుంబ సభ్యులపై భౌతిక దాడి చేశారని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. దాడికి గురైన వర్షిత్‌రెడ్డి కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించేందుకు, బీజేపీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు రామచంద్రరావు నల్లగొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పర్యటనకు బయలుదేరే సమయానికి పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన రామచంద్రరావు, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పరామర్శకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్.. ఫ్యూచర్ సిటీకి ప్రపంచ వర్సిటీల క్యూ!

