Dailyhunt
బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం.. స్టాలిన్ షాకింగ్ నిరసన!

బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం.. స్టాలిన్ షాకింగ్ నిరసన!

వార్త 1 week ago

MK Stalin: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన నిరసనను ఉధృతం చేశారు.

ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన గురువారం బిల్లు ప్రతులను బహిరంగంగా దహనం చేశారు. డీలిమిటేషన్ (Delimitation)కు వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి తన నిరసనను తెలిపారు. అనంతరం 'కలిసి పోరాడదాం.. గెలుద్దాం' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టాలిన్ ఎక్స్లో లో పోస్టు చేశారు. ప్రతిఘటన జ్వాలలు తమిళనాడు అంతా వ్యాపించాలని, ఇవి భాజపా అహంకారాన్ని అణచివేయాలంటూ ఆయన పోస్టులో రాసుకొచ్చారు.

Read Also:Delimitation india : లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంపు సంకేతం

లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల స్థానాలను మార్చేందుకు ఉద్దేశించిన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఈ బిల్లు తీరని నష్టం చేకూరుస్తుందని ఆయన మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు ఈ డీలిమిటేషన్ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆపబోమని ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు.

MK Stalin: హిందీ ఉద్యమ సెగను గుర్తు చేస్తూ..

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ గత చరిత్రను గుర్తు చేశారు.1960లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 'గతంలో తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతిఘటన జ్వాల దిల్లీని దహించివేసింది. దిల్లీ దిగొచ్చిన తర్వాతే పరిస్థితి శాంతించింది. ఈ బ్లాక్ బిల్లు (డీలిమిటేషన్ ను ఉద్దేశిస్తూ) సొంతగడ్డ పైనే తమిళులను శరణార్థులుగా మార్చాలని చూస్తుంది. నేడు ఈ బిల్లు కాపీని తగలబెట్టి, నల్లజెండా ఎగరవేసి మరో జ్వాలను రగిలించాను. ఈ మంటలు భాజపా అహంకారాన్ని అణచివేస్తాయి' అని స్టాలిన్ అన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha