Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ నేతల ప్రచారమంతా అవాస్తవమే: రేవంత్

బీజేపీ నేతల ప్రచారమంతా అవాస్తవమే: రేవంత్

వార్త 3 weeks ago

Revanth Reddy: తన అమెరికా పర్యటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు కావాలనే తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తాము విదేశాంగ శాఖకు పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా సమర్పించామని తెలిపారు.

స్పష్టమైన కార్యాచరణతోనే పర్యటన

విద్య, క్రీడలు, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై తమ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశాన్ని (పర్పస్‌) విదేశాంగ శాఖకు ముందే స్పష్టంగా తెలియజేసినట్లు సీఎం వివరించారు. రాజకీయ కోణంలో, రాజకీయపరమైన ఉద్దేశాలతోనే కొందరు కావాలని ఈ పర్యటనకు అడ్డంకులు సృష్టించేలా మాట్లాడారని విమర్శించారు.

Revanth Reddy: బీజేపీ నేతల స్థాయిపై ఘాటు వ్యాఖ్యలు

బీజేపీ నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకుల విమర్శలను తాను పట్టించుకోదల్చుకోలేదని, వారికి అంత స్థాయి లేదని తేల్చిచెప్పారు.

Epaper: epaper.vaartha.com

కొండా సురేఖ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది: సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha