CM vijay wife sangeetha: తమిళనాడు TVK అధినేత ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత, రాజకీయ జీవితంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన సతీమణి సంగీత సోర్నలింగం చుట్టూ చెన్నై రాజకీయాలు తిరుగుతున్నాయి.
సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో గుసగుసలుగా వినిపిస్తూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Read Also: Plastic Currency in India : భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
CM Vijay’s wife’s entry into BJP?.. Intense debate in political circles
CM vijay wife sangeetha:ఎన్నికల ముందే విడాకుల ఊహాగానాలు
ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి ఊహాగానాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా విజయ్, సంగీత దంపతుల మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపించింది. ఎన్నికలకు ముందే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన విజయ్ సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా సంగీత హాజరుకాకపోవడం, ఆమె విదేశాల్లోనే ఉండిపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
బీజేపీ వైపు సంగీత అడుగులు?
విజయ్ రాజకీయాల్లోకి వచ్చి రికార్డు విజయాన్ని అందుకోగా, ఇప్పుడు ఆయనకు పోటీగా సంగీతను రంగంలోకి దించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయ్‌ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు కేంద్ర అధికార పార్టీ బీజేపీ, సంగీతకు గాలం వేస్తోందని, ఆమె కూడా కమలం గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో ఇది అత్యంత పెద్ద సంచలనంగా మారడం ఖాయం. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు రెండు వేర్వేరు రాజకీయ పార్టీల సిద్ధాంతాల పోరాటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విషయాలపై అటు బీజేపీ వర్గాల నుండి కానీ, ఇటు సంగీత సన్నిహితుల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా జనాల్లోకి వెళ్తున్న విజయ్‌కు ఈ ప్రచారం ఒక పెద్ద సవాల్‌గా మారింది. సంగీత నిజంగానే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? లేదా ఇవన్నీ కేవలం రాజకీయ ప్రత్యర్థులు సృష్టిస్తున్న పుకార్లేనా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

