Dailyhunt
Bill Gates: చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో బిల్ గేట్స్ భేటీ

Bill Gates: చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో బిల్ గేట్స్ భేటీ

వార్త 1 month ago

Bill Gates: గ్లోబల్ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి నుంచి అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు.

సెక్రటేరియట్ వద్ద ఆయనకు చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్ కు మంత్రులను చంద్రబాబు పరిచయం చేశారు.

ప్రధాన రంగాలపై చర్చలు

ఈ పర్యటనలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యం, కృత్రిమ మేధ (AI), డిజిటల్ పాలన, వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య సంబంధిత పథకాలు, వాటిని రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా విస్తరించే విధానాలు, AI ఆధారిత సాంకేతికతను ప్రజాసేవల్లో ఎలా వినియోగించవచ్చనే అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఇవిగో.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha