Dailyhunt
బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేయొద్దు - ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేయొద్దు - ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

వార్త 1 week ago

వేసవి కాలంలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆ నరకం వర్ణనాతీతం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం ఒక మానవీయ నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే తక్షణమే కనెక్షన్ కట్ చేయడం విద్యుత్ సంస్థలకు పరిపాటి. అయితే, ప్రస్తుత ఎండ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్ వర్థన్ సింగ్, గృహ వినియోగదారులు బిల్లులు చెల్లించకపోయినా కనెక్షన్ తొలగించవద్దని విద్యుత్ పంపిణీ సంస్థలను (Discoms) ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్వహణ పనుల వల్ల విద్యుత్ నిలిపివేయాల్సి వస్తే, ఆ విషయాన్ని ముందే వినియోగదారులకు SMS ద్వారా తెలియజేయాలి. సరఫరా నిలిపివేతపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హెచ్చరించారు.

Read Also: Andaman Sea Boat Accident: అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం: పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు!

 Odisha Govt

Odisha Govt: వ్యాపారాలు, దైనందిన జీవితంపై ప్రభావం

రాజధాని భువనేశ్వర్ వంటి నగరాల్లో మధ్యాహ్నం వేళ విద్యుత్ కోతల వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, ప్రజలు ఇళ్లలో ఉండలేకపోతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎండలు తగ్గుముఖం పట్టే వరకు సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని డిస్కంలకు ఆదేశాలు వెళ్లాయి. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, తెలంగాణలోని వినియోగదారులు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెల బిల్లు చెల్లించకపోయినా వెంటనే లైన్‌మెన్‌లు వచ్చి కనెక్షన్ కట్ చేస్తున్నారని, దీనివల్ల వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఒడిశా తరహాలోనే తెలంగాణలో కూడా వేసవి ముగిసే వరకు విద్యుత్ కనెక్షన్ల కటింగ్ నిలిపివేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha