Dailyhunt
బిల్లు షేర్ చేయమంటే బంధమే వద్దంది

బిల్లు షేర్ చేయమంటే బంధమే వద్దంది

వార్త 1 week ago

Mumbai: మెట్రో నగరాల్లో డేటింగ్ అనేది ఇప్పుడు ఒక ఎమోషనల్ బాండ్ కంటే ఎక్కువగా ఒక 'ఫైనాన్షియల్ మైండ్ గేమ్'గా మారుతోంది. తాజాగా ముంబైకి చెందిన 36 ఏళ్ల హై-ప్రొఫైల్ యువతికి ఎదురైన అనుభవం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కేవలం రూ. 2,500 బిల్లు విషయంలో మొదలైన చిన్న చర్చ, ఏకంగా ఒక వివాహ సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్లింది.

Read Also:Gurugram Youth Death: కాబోయే భార్య రాకముందే విషాదం..డ్రగ్స్ ఓవర్ డోస్ కారణమా?

అసలేం జరిగింది?

సంవత్సరానికి రూ. 80 లక్షల వేతనం తీసుకునే సదరు యువతికి, ఒక మ్యాచ్ మేకింగ్ సర్వీస్ ద్వారా ఒక యువకుడు పరిచయమయ్యాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో మూడో మీటింగ్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది.మొదటి రెండు మీటింగ్స్ లో ఖర్చులన్నీ ఆ యువకుడే భరించాడు.మూడవ మీటింగ్ లో డిన్నర్ బిల్లు ₹5,000 రాగా, ఆ యువకుడు ‘డచ్’ (సగం సగం బిల్లు కట్టడం) పద్ధతిని ప్రతిపాదించాడు.ఆమె నిశ్శబ్దంగా తన వాటా ₹2,500 చెల్లించి, మరుసటి రోజే ఆ సంబంధాన్ని తెంచుకుంది.

Mumbai: “అది డబ్బు సమస్య కాదు.. స్వభావం సమస్య”

తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. “నాకు ₹2,500 పెద్ద మొత్తం కాదు, అంతకంటే పదింతలు నేనే ఖర్చు పెట్టగలను. కానీ మూడవ డేట్‌లోనే అతను లెక్కలు వేయడం నాకు నచ్చలేదు. నాతో బంధాన్ని అతను ఒక లావాదేవీ (Transaction) లాగా చూస్తున్నాడనిపించింది. నా మీద ఖర్చు చేయడం అతనికి భారం అనిపించినప్పుడు, అలాంటి వ్యక్తితో జీవితాన్ని ఎలా పంచుకోగలను?” అని ఆమె ప్రశ్నించింది.

 Split the Bill Controversy

ఈ ఉదంతంపై సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది.

  1. ఆమెకు మద్దతుగా: మొదటి కొన్ని రోజుల్లోనే ఇలా లెక్కలు వేసేవారు భవిష్యత్తులో మరింత ఇబ్బంది పెడతారని కొందరు సమర్థిస్తున్నారు.
  2. యువకుడికి మద్దతుగా: ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు బిల్లు షేర్ చేసుకోవడంలో తప్పేముందని, ₹80 లక్షలు సంపాదించే ఆమె ₹2,500 కోసం ఇంత రచ్చ చేయాలా అని మరికొందరు విమర్శిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha