Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Blinkit vs Zepto: 'గిగ్ వర్కర్' ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?

Blinkit vs Zepto: 'గిగ్ వర్కర్' ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?

వార్త 4 months ago

చాలా మంది నిరుద్యోగులు, చదువుతున్న యువత Blinkit, Zepto, Instamart వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆదాయం పొందుతున్నారు. సొంత ఖర్చుల కోసం పార్ట్ టైమ్ చేసేవారితో పాటు పూర్తిస్థాయిలో గిగ్ వర్కర్లుగా (Blinkit vs Zepto) మారి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

ప్రతి రోజు 12-14 గంటల కష్టపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు డెలివరీ యాప్స్ ద్వారా సాధ్యమైన సంపాదన, ఏ ప్లాట్‌ఫామ్ మెరుగ్గా ఉందో వివరిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయ్యాడు.

ఆర్డర్‌ల ఆధారంగా ఆదాయం మార్పు

యువకుడు (Blinkit vs Zepto) బ్లింకిట్, జెప్టో ప్లాట్‌ఫామ్‌లలో మూడు రోజుల పాటు డెలివరీ భాగస్వామిగా పనిచేసి, తనకు వచ్చిన ఆదాయాన్ని పోల్చి చూపించాడు. రోజుకు సుమారు 12-13 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసినట్లు ఆ యువకుడు తెలిపాడు. బ్లింకిట్, జెప్టోలలో డెలివరీ ఛార్జీలు, ఇన్సెంటివ్‌లు, ఆర్డర్ల సంఖ్యను బట్టి వచ్చే ఆదాయం ఎలా మారుతుందో గణాంకాలతో సహా వివరించాడు. ముందుగా బ్లింకిట్‌లో గంటకు రూ.100 కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్లింకిట్‌లో మూడ్రోజుల పాటు దాదాపు 13-14 గంటలు కష్టపడితే రూ.3088 రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పాడు.

ఆ తర్వాత జెప్టోలోనూ వరుసగా మూడ్రోజులు డెలవరీ చేశాడు. ఇందులో మెుదటి రోజు రూ. 1783, రెండో రోజు రూ.1493, మూడో రోజూ రూ. 1766 సంపాదించినట్లు వెల్లడించారు. ఇందులో 12-13 గంటలు కష్టపడితే మూడ్రోజులకు కలిపి రూ.5042 వచ్చినట్లు చెప్పాడు. మెుత్తంగా రెండు ఫ్లాట్‌ఫాంల నుంచి ఆరు రోజుల్లో రూ.8,130 సంపాదించినట్లు చెప్పారు. మెుత్తంగా బ్లింకిట్ కంటే జెప్టో ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిందని వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోలను ట్వీట్ చేసిన వీనిత్ అనే ట్విట్టర్ ఎక్స్ యూజర్ అతడి సంపాదనను వెల్లడించారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అక్కడ ఆదాయాన్నే కాదని టైం, హార్డ్ వర్క్, పొల్యూషన్, ఎండ తీవ్రతకు అతడు పడే కష్టం వంటివి చూడాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ఇదేదో బాగుందే మనమూ ట్రై చేస్తే పోలే అని రాసుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha