Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బోరంచలో రూ. 95 లక్షలతో కొత్త నీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభం!

బోరంచలో రూ. 95 లక్షలతో కొత్త నీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభం!

వార్త 2 months ago

Borancha news:మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలో రూ. 95 లక్షల వ్యయంతో చేపట్టనున్న 4 ఎం ఎల్ డి (MLD) నీటి శుద్ధి కేంద్రం (WTP) పునరుద్ధీకరణ పనులకు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈరోజు అధికారికంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బోరంచ పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే ఈ నీటి శుద్ధి కేంద్రాన్ని రూ. 95 లక్షల నిధులతో అత్యాధునిక సాంకేతికతతో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read also; KTR Counter to Pawan Kalyan:సోదరుడిగా వస్తే ఆదరిస్తాం.. పాలిటిక్స్ చేస్తే ఒప్పుకోం!

 Renovation of Borancha Water Treatment Plant

Borancha news:హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

పనులను నిర్ణీత కాలవ్యవధిలోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. గత కొంతకాలంగా నీటి శుద్ధి కేంద్రం పునరుద్ధరణ పనుల కోసం ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల సమస్యను గుర్తించి, నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభించడం పట్ల గ్రామస్తులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ల లోకేష్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి . సర్పంచులు,దిగంబర్ రెడ్డి,సిద్ధ రెడ్డి,బీరప్ప,సంజీవ్, శివాజీ పాటిల్,, కరీం ఉప సర్పంచ్, రాజు ,అఖిలేష్ రెడ్డి,వెంకటేశం,మల్లయ్య,మతీన్,నర్సింలు, ఆనంద్, సంజీవ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కూకట్‌పల్లి అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహానికి ఏకంగా గుడి కట్టేసిన ఫ్యాన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha