Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Botsa Satyanarayana: శాసన మండలిలో వైసీపీ వాకౌట్.. విద్యా విధానాలపై నిరసన

Botsa Satyanarayana: శాసన మండలిలో వైసీపీ వాకౌట్.. విద్యా విధానాలపై నిరసన

వార్త 4 months ago

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాకౌట్‌కు దిగారు. విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మండలిలో స్పష్టం చేశారు.

ప్రభుత్వ చర్యలు విద్యా వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ, వాటిపై తమ నిరసనను స్పష్టంగా వ్యక్తం చేయడానికే వాకౌట్ చేశామని తెలిపారు.

ప్రజల దృష్టికి లోపాలు తీసుకురావడమే లక్ష్యం: బొత్స

అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా వాకౌట్ చేయడం తమకు అలవాటు కాదని బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. పాలనలో ఉన్న లోపాలను ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర కీలకమని, అవసరమైన చోట ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha