Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Breaking News: Anakapalli: రేబిస్ వలన పన్నెండేళ్ల బాలుడు మృతి

Breaking News: Anakapalli: రేబిస్ వలన పన్నెండేళ్ల బాలుడు మృతి

వార్త 4 months ago

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapalli) జిల్లా అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలుడు రేబిస్ సోకి మృతి చెందాడు.

వీధి కుక్క కరవడంతో సకాలంలో వ్యాక్సిన్ తీసుకోకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వ్యాధి తీవ్రమై ఆసుపత్రిలో చేర్చినా, ఆరోగ్యం విషమించి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు తనతో పాటు ఆడుకునే కుక్కతోనే ఈ విషాదం జరగడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha