Brain Drain : ఎన్నో అంతరిక్ష ప్రయోగాలను ఎంతో అవలీలగా ప్రయోగించి విజయవంతమైన చరిత్ర సృష్టించిన 'ఇస్రో' అంతరిక్షా ప్రయోగ కేంద్రం ఈ మధ్యకాలంలో ఎందుకో చతికిలపడిపోయింది.
చేసిన అన్ని ప్రయత్నా లూ ఫలించాలని లేదు. కానీ సమిష్టి కృషిగా శాస్త్రవేత్తలు ప్రయోగాలన్నీ సఫలత చెందితే దేశప్రతిష్ట పెరు గుతంది. కానీ ఇప్పుడు ‘ఇస్రో’లో జరుగుతున్న కలవర పాటు సంఘటనలపై ప్రభుత్వాలు సైతం ఆందోళన చెందుతున్నట్లు గానే ఉంది. కానీ ‘ఇస్రో’ నుంచి శాస్త్రజ్ఞుల వలస గురించి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ నిజమేనని చెబుతూనే ‘చాలా మంది శాస్త్రజ్ఞులు వెళ్తుంటారు, కొత్త వారు వస్తుంటారు’ దాని గూర్చి ఎలాంటి ఆందోళన లేదని సమర్ధించుకున్నారు. ఇస్రోలో దాదాపు 14,600 మంది ఉద్యోగులుండగా అందులో 100-120 మంది నిష్క్రమించడాన్ని అతి తక్కువే కదా! అని అనుకోలేం.
Brain Drain
Brain Drain : ‘బ్రెయిన్ డ్రెయిన్’ మంచిది కాదనే..
ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగమైన వారు తాజాగా ఆప్రయోగాల నుంచి తప్పించుకుంటున్నారు. రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నాడు. మంచి అవకాశం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పోవడాన్ని ఎవరూ కాదనలేరు, కానీ తమ ఉపాధిని పెంచుకునే అవకాశము న్నప్పుడు వాటిని త్రోసిరాజని ఎందుకు వెళ్లిపోతున్నారో తెలుసుకుని వాటికి అడ్డుకట్ట వేయలేకపోతే వేయలేకపోతే ఇలాంటి సంస్థల మనుగడకే కష్టం. శాస్త్రజ్ఞుల వరుస రాజీనా మాలు, స్వచ్ఛంద పదవీ విరమణలనగానే సంస్థ పట్ల వారిలో ఏదో అసంతృప్తి ఉందనే అనుకోవాలి. మరో ప్రైవేట్ సంస్థల్లో హెచ్చు జీతానికే మంచి హోదాలో వెళ్ల డమంటే ఒక విధంగా వారికి మంచిదే కావచ్చు. కానీ అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనలకు పేరుగాంచిన ‘ఇస్రో’ నుంచి ‘బ్రెయిన్ డ్రెయిన్’ మంచిది కాదనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. ఇదొక ఆందో ళనకర విషయం. గగన్యాన్, చంద్రయాన్-4, లాంటి చారిత్రక ప్రాజె క్టులు అత్యున్నత కీలక దశలో ఉండగా నూరు మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, రాజీనామా చేశారని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారన్న వార్తలు రావ డంతో కేంద్రం తక్షణ చర్యలు తీసుకొంది. శాస్త్రజ్ఞుల రాజీనామాలను ఆమోదించే ప్రక్రియను కఠినతరం చేసింది. ఈ విషయమై జూలై 14న అంతరిక్ష పరిశో ధనా విభాగం రాజీనామాలపై ప్రత్యేక మెమొరాండం జారీ చేసింది.
ఐటియన్లు ‘ఇస్రో’ లో చేరడానికి ఇష్టపడడం లేదు
జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో పనిచేసే గ్రూపి సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది రాజీనామా, స్వచ్చంద పదవీ విరమణ దరఖాస్తులను నేరుగా కేంద్రా నికి పంపేపద్దతి ఇకపై నివారించబడినట్లు దాని సారాం శం. ప్రతి దరఖాస్తును నేరుగా అతరిక్ష పరిశోధనా శాఖకే చేరాలి. ‘ఇస్రోకు సంబంధించిన అత్యధిక రాజీనామాలు బెంగళూరులోని యు.ఆర్. ఆరావు శాటిలైట్ కేంద్రం నుంచి 80 మంది. తిరువనంతపురం స్పేస్ సెంటర్ నుంచి 20మంది ఉ న్నారు. అలా వెళ్లిన వారిలో భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలకమైన ఎల్విఎం 3 ప్రాజెక్టు డైరెక్టర్, స్పాడెక్స్ ప్రాజెక్టు డైరక్టర్, చంద్రయాన్-3 సిమ్యూలేషన్ మేనేజరు ఒకేసారి రాజీనామా చేసి వెళ్లి పోతే అంతరిక్ష పరిశోధనా సాంకేతిక బదిలీ విషయాల లో ‘ఇస్రో’ మిషన్ల కొనసాగింపుపై ప్రభావంపడుతుంది. కారణాలు విశ్లేషించుకుంటే ప్రైవేట్ రంగం లో అంతరిక్ష కేంద్రాలకు అనుమతులివ్వడంతో స్కైరూట్ అగ్నికుల్, పిక్సెల్, ధ్రువస్పేస్ లాంటి 400 స్టార్టప్లు వచ్చి చేరాయి. అక్కడ ఉద్యోగులకు ఇస్రో శాస్త్రజ్ఞుల కన్నా 2,3 రెట్లు వేతనం లభిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో శాస్త్రవేత్తల సగటు వేతనం 80వేల డాలర్ల నుంచి1.5లక్షల డాలర్ల దాకా ఉంటుంది. అంటే. ఇండియన్ కరెన్సీలో రూ.77 లక్షల నుంచి 1.4 కోట్ల దాకా ఉంటుంది. ఇస్రోల సీనియర్ సైంటిస్టుల జీతాలు సైతం సగటు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినర్ల వేతనాల కన్నా తక్కువే. ఈ కారణం చేతనే ఐటియన్లు ‘ఇస్రో’ లో చేరడానికి ఇష్టపడడం లేదు.
Brain Drain
వేతనాల విషయంలో వ్యత్యాసాల వలన
2023లో ఇండియన్ స్పేస్ పాలసీ తెచ్చాక వేతనాల విషయంలో వ్యత్యాసాల వలన శాస్త్రజ్ఞులకు కొత్తఆధారం దొరకడంతో వారు ‘ఇస్రో’ ను వదిలి వెళ్తున్నట్లు భావించవచ్చు. స్టాక్ ఆప్షన్, పెక్సి బిలిటీకి అవకాశం ఉంది. 2025లోనే ప్రైవేట్ స్పేస్ స్టార్టవ్లలో 15కోట్ల డాలర్ల పెట్టుబడి వచ్చింది. ప్రభుత్వ వ్యవస్థలో ప్రమోషన్లు నెమ్మదిగా వస్తాయి. ప్రైవేట్ వేగం గా నిర్ణయాలే కాకుండా ఆధునిక టెక్నాలజీపై పనిచేసే అవకాశాలుంటాయి. ఇస్రో బ్రెయిన్ డ్రెయిన్’ ఇవాళ్లిది కాదు. 2004-2005లో 392 మంది శాస్త్రవేత్తలు బయ టికి వెళ్లిపోయారు. అప్పట్లో ఈ అంశం పరిశీలనలోకి వచ్చినా కేవలం ఐటిరంగం విస్తృతి, ప్రైవేట్ రంగ జీతా లేనని ప్రభుత్వం పార్లమెంటులోనే విశ్లేషించి చెప్పింది. నిజానికి శాస్త్రజ్ఞులు వెళ్లకుండా తాత్కాలికంగా ఆపవచ్చే మో కానీవిజ్ఞాన విస్తృతిని ఆపేపరిస్థితి ఉండదు. అందుచే వారికి మెరుగైన అవకాశాలను కేంద్రప్రభుత్వమే కల్పించా లి. అలాంటప్పుడు మాత్రమే శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు ప్రభుత్వ సంస్థలను వదిలివెళ్లే అవకాశం తక్కువగా ఉం టుంది. భారీ జీతాల మాటెలా ఉన్నా, రిసెర్చ్ గ్రాంట్లు, ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్లు, ప్రాజెక్టు లీడర్షిప్ అవకాశాలు కల్పించడం అవసరం. ఇస్రోలో శిక్షణ పొందిన వారు ప్రయివేట్ రంగానికి వెళ్లడం ద్వారా మొత్తం భారత అంతరిక్ష ఎకో సిస్టమ్ బలపడుతుంది. ‘ఇస్రో’లో అంతరిక్ష నౌకల ప్రయోగాల అనంతరం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బ్రెయిన్ డ్రెయిన్ సమర్ధనీయం కాదు. వాళ్లు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు వెళ్లిపోకుండా తగు నిర్ణయాలు తీసు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంమీద ఉంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలి.
Read Also hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసాలు.. మార్కులు తగ్గాయంటూ విద్యార్థుల ఆందోళన

