Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRICS సమ్మిట్.. నేటి షెడ్యూల్ ఇదే

BRICS సమ్మిట్.. నేటి షెడ్యూల్ ఇదే

వార్త 3 weeks ago

BRICS : న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో అత్యంత వైభవంగా జరుగుతున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు-2026 నేటితో ముగియనుంది. ముగింపు రోజున ప్రతినిధులు మరియు అధినేతల కోసం పక్కాగా షెడ్యూల్ ఖరారు చేశారు.

ఉదయం 9:55 గంటలకు సభ్య దేశాల ప్రతినిధులు, భాగస్వామ్య దేశాల నాయకులు మరియు ప్రత్యేక అతిథులు వేదికైన భారత్ మంటపానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10:35 గంటలకు అంతర్జాతీయ నాయకులందరూ కలిసి అధికారిక గ్రూప్ ఫోటో (Official Group Photo) దిగుతారు. దీని తర్వాత ఉదయం 10:50 గంటలకు ప్రారంభమయ్యే ప్రధాన ఓపెన్ సెషన్‌లో పాల్గొని ప్రపంచ ఆర్థిక పురోగతి, ప్రాంతీయ భద్రత మరియు సహకారంపై కీలక చర్చలు జరుపుతారు.

చారిత్రాత్మక ‘ఢిల్లీ డిక్లరేషన్’ విడుదల: ముగియనున్న శిఖరాగ్ర సదస్సు

ఈ సదస్సు ముగింపు ఘట్టంలో భాగంగా అత్యంత కీలకమైన ‘ఢిల్లీ డిక్లరేషన్’ (Delhi Declaration)ను అధికారికంగా విడుదల చేయనున్నారు. నిన్న జరిగిన క్లోజ్డ్-డోర్ సెషన్‌లో సభ్య దేశాల అధినేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాలు, ఆర్థిక ఒప్పందాలు మరియు భవిష్యత్ కార్యాచరణను ఈ డిక్లరేషన్‌లో పొందుపరిచారు. ఈ ప్రకటన విడుదలకావడంతో బ్రిక్స్ సదస్సు ముగుస్తుంది. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ తొలి రోజు సాధించిన విజయాలు, విదేశీ నేతలతో జరిపిన ద్వైపాక్షిక చర్చల దృశ్యాలతో కూడిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా, అది విశేషంగా ఆకట్టుకుంటోంది.

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో తీవ్ర నష్టం - జిన్పింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha