BRICS Summit 2026: అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న బ్రిక్స్ సమ్మిట్-2026 నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో పాటు ప్రత్యేక అతిథులు ఉదయం 9:55 గంటలకు భారత్ మండపానికి చేరుకోనున్నారు.

అధికారిక గ్రూప్ ఫోటో మరియు ఓపెన్ సెషన్
సదస్సులో భాగంగా ఉదయం 10:35 గంటలకు ప్రపంచ దేశాల నేతలు అందరూ కలిసి అధికారిక గ్రూప్ ఫోటో దిగనున్నారు. అనంతరం ఉదయం 10:50 గంటలకు ప్రధాన ఓపెన్ సెషన్‌లో ప్రతినిధులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు.
BRICS Summit 2026: ‘ఢిల్లీ డిక్లరేషన్’ విడుదల – సదస్సు ముగింపు
గత రాత్రి జరిగిన క్లోజ్డ్ సెషన్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రతిష్టాత్మక 'ఢిల్లీ డిక్లరేషన్'ను ఈ వేదికపై అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ డిక్లరేషన్ విడుదలతో ఈ ఏడాది బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియనుంది. కాగా, సదస్సు తొలి రోజు జరిగిన విశేషాలు మరియు ముఖ్యాంశాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సముద్ర నావికుల కోసం ఎమర్జెన్సీ నెట్‌వర్క్: బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రతిపాదన

