Dailyhunt
Budget 2026: ఈసారి స్మార్ట్ అగ్రికల్చర్ బడ్జెట్.. వ్యవసాయానికి రూ.1.50 లక్షల కోట్లు

Budget 2026: ఈసారి స్మార్ట్ అగ్రికల్చర్ బడ్జెట్.. వ్యవసాయానికి రూ.1.50 లక్షల కోట్లు

వార్త 2 months ago

2025-26 కంటే రూ.13 లక్షల కోట్లు ఎక్కువ

హైదరాబాద్ : వచ్చే 2026-27 బడ్జెట్లో ప్రధానంగా సంప్రదాయ సాగు విధానాల నుంచి సాంకేతికత ఆధారిత స్మార్ట్ అగ్రికల్చర్ వైపు తీసుకెళ్లే మార్పును లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది.

తాత్కాలిక సబ్సిడీలకు పరిమితం కాకుండా ఉత్పాదకత, స్థిరత్వం, మార్కెట్ ఆధారిత వృద్ధి దిశగా వ్యవసాయాన్ని తీసుకెళ్లే విధాన నిర్ణయాలు ఈ కొత్త బడ్జెట్లో రూపకల్పన చేస్తోంది. ఈ నేపథ్యంలో 2026-27 కేంద్ర అంచనా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మద్దతును పెంచడానికిగాను దాదాపు రూ.1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత 2025-26 అంచనా బడ్జెట్లో కేంద్రం రూ.1.37 లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. దీనికన్నా ఈ సారి రూ.13 లక్షల కోట్లు అదనంగా కేటాయించనున్నట్లు సమాచారం.

Read also: Amaravati : నేడు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

Budget 2026

డిజిటల్ వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, (Agriculture) రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి వెల్లడించిన వివరాలు ప్రకారం ఈసారి బడ్జెట్లో సబ్సిడీ సంస్కరణలు, డిజిటల్ వ్యవసాయం, క్లైమేట్ రెసిలియంట్ పద్ధతులు, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండనున్నాయి. పశుపోషణ, మత్స్య సంపద, ఉద్యానవనాల వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టడంద్వారా రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపడుతుంది. కేంద్రబడ్జెట్ కోసం ప్రాథమిక నివేదికలు, అంచనాల ఆధారంగా కేటాయింపుల పెంపుదల, డిజిటల్ స్వీకరణ, వాతావరణ స్థితి స్థాపక పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగం బలోపేతంపై దృష్టి సారిస్తోంది.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రత్యక్ష నగదు ప్రయోజనాల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల ఆర్థిక సాయాన్ని రూ.8 వేలకు పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వనుంది.

రైతులకు ప్రత్యక్ష మద్దతు, రుణాలు మరియు విత్తన సంస్కరణలు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Liquor Case : లిక్కర్ స్కామ్ అనేది అతడికే తెలుసు - విజయసాయి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha