Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుల్లితెర క్రేజీ కపుల్ ప్రియాంక జైన్-శివకుమార్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

బుల్లితెర క్రేజీ కపుల్ ప్రియాంక జైన్-శివకుమార్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

వార్త 3 weeks ago

Priyanka Jain Marriage: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీ జంటలలో ప్రియాంక జైన్ (Priyanka Jain), శివకుమార్ (Shivakumar) జోడీ ఒకటి.

‘మౌనరాగం’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు లవ్లీ కపుల్‌గా పరిచయమైన వీరిద్దరూ.. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఏడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అప్‌డేట్స్ మరియు యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా అభిమానులను అలరించే ఈ జంట.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.

Read Also :Mahesh Babu Tribute On Superstar Krishna:ఎప్పటికీ మీరే నా హీరో: తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్!

ఉత్తరాఖండ్‌లో సాంప్రదాయ పెళ్లి..

నటుడు శివకుమార్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమ పెళ్లి ప్రణాళికలను పూర్తిగా వెల్లడించారు. వీరి వివాహం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అత్యంత సాంప్రదాయబద్ధంగా జరగనుంది. ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధ 'యోగి నారాయణ్ ఆలయం' (Yogi Narayan Temple) లో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. కేవలం ముఖ్యమైన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉత్తరాఖండ్‌లో వివాహం ముగిసిన తర్వాత.. హైదరాబాద్‌లోని ఇండస్ట్రీ స్నేహితులు, సెలబ్రిటీలు మరియు అభిమానుల కోసం ఒక గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ (Wedding Reception) వేడుకను ఏర్పాటు చేయనున్నారు.

Priyanka Jain Marriage: సొంతింటి కల నెరవేరిన వెంటనే వివాహం

ప్రస్తుతం ప్రియాంక, శివకుమార్ కలిసి హైదరాబాద్‌లో తమ అభిరుచులకు అనుగుణంగా ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఆ డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇంటి నిర్మాణం పూర్తిగా పూర్తయిన వెంటనే తాము పెళ్లి పీటలు ఎక్కుతామని శివకుమార్ స్పష్టం చేశారు.

కుటుంబ సభ్యుల అనుమతితోనే 'లివ్-ఇన్'

ఈ సందర్భంగా తమ వ్యక్తిగత జీవితంపై వస్తున్న కొన్ని వార్తలకు శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం ప్రస్తుతం ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న మాట నిజమేనని (Liv-in Relationship) అంగీకరించారు. అయితే, ఇది ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యుల పూర్తి అనుమతి, ఆశీస్సులతోనే జరుగుతోందని, తమ మధ్య ఎలాంటి దాపరికాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 ద్వారా ప్రియాంక జైన్ క్రేజ్ మరింత పెరగగా, శివకుమార్ కూడా పలు సీరియల్స్ మరియు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ లవ్లీ కపుల్ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని బుల్లితెర నటీనటులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం..అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha