Airtel Recharge Prices Hike: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మరోసారి టారిఫ్ ధరలను సవరించింది. అత్యధికంగా అమ్ముడయ్యే కొన్ని ప్లాన్ల ధరలను పెంచడంతో పాటు, మరికొన్ని ప్లాన్లను పూర్తిగా తొలగించి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపింది.
ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు సంస్థ స్పష్టం చేసింది.
Read Also: Indias first LED Credit Card: దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
ఏయే ప్లాన్లపై ప్రభావం?
ప్రస్తుత సవరణలో ప్రధానంగా వినియోగదారులు ఎక్కువగా వాడే ప్లాన్లపై ప్రభావం పడింది:
- రూ. 799 ప్లాన్ (ఇప్పుడు రూ. 899): రోజుకు 1.5GB డేటాను అందించే ఈ పాపులర్ ప్లాన్ ధరను ఎయిర్‌టెల్ అక్షరాలా రూ. 100 పెంచింది. ఇకపై ఈ బెనిఫిట్స్ పొందాలంటే కస్టమర్లు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది.
- రూ. 859 ప్లాన్ రద్దు: గతంలో అందుబాటులో ఉన్న రూ. 859 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తన పోర్ట్‌ఫోలియో నుండి పూర్తిగా తొలగించింది. దీంతో ఆ ప్లాన్ వాడే కస్టమర్లు ఇప్పుడు ఇతర ఖరీదైన ఆప్షన్లను ఎంచుకోవాల్సి వస్తోంది.

Airtel Recharge Prices Hike: వినియోగదారులపై భారం
ఇతర టెలికాం సంస్థలైన జియో కూడా ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో, ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డేటా వినియోగం పెరిగిన నేపథ్యంలో, ఇలా ప్లాన్ల ధరలు పెరగడం సామాన్య ప్రజల జేబుకు చిల్లు పెట్టే అంశమే. ఈ మార్పులు ఇప్పటికే ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ మరియు యాప్‌లలో అప్‌డేట్ అయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

