Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్

బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్

వార్త 2 weeks ago

Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు కీలక సమాచారం. ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె చేపడతామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ (AIBEA) ప్రకటించింది.

బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో నాలుగు శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలన్న అంశం కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడంతో సమ్మెకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని యూనియన్ నేతలు చెబుతున్నారు.

Read Also :Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

నాలుగు శనివారాల సెలవుల కోసం డిమాండ్

ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు నెలలో రెండు శనివారాలు మాత్రమే సెలవు ఉంటున్నాయి. వారంలోని నాలుగు శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. అయితే నాలుగు శనివారాల సెలవులను అమలు చేయాలంటే మిగిలిన పనిదినాల్లో బ్యాంకింగ్ పని గంటలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు AIBEA ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం తెలిపారు.

రోజూ 40 నిమిషాల అదనపు పని గంటలకు అంగీకారం

ప్రభుత్వ ప్రతిపాదనకు బ్యాంకు ఉద్యోగులు అంగీకరించారని వెంకటాచలం వెల్లడించారు. నాలుగు శనివారాల సెలవులకు బదులుగా ప్రతిరోజూ కస్టమర్ సర్వీస్ సమయాన్ని అదనంగా 40 నిమిషాలు పెంచేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే ఒప్పందం జరిగినప్పటికీ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. తమ డిమాండ్ల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 22న కీలక సమావేశం

ఈ సమస్యపై చర్చించేందుకు లేబర్ వెల్ఫేర్ కమిషనర్ సెప్టెంబర్ 22న సమావేశానికి పిలిచినట్లు వెంకటాచలం తెలిపారు. ఈ సమావేశంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే చర్చలు విఫలమైతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మె చేపట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సమ్మె జరిగితే దేశవ్యాప్తంగా బ్యాంకుల సాధారణ కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నగదు లావాదేవీలు, శాఖల్లో జరిగే ఇతర సేవలకు అంతరాయం కలగొచ్చు. అయితే సమ్మెపై తుది పరిస్థితి సెప్టెంబర్ 22న జరిగే చర్చల అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది. కస్టమర్లు తమ బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.

ఒరాకిల్‌ ఉద్యోగులకు షాక్‌.. లేఆఫ్‌ మెయిల్స్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha