Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 5 రోజులు సేవలకు బ్రేక్

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 5 రోజులు సేవలకు బ్రేక్

వార్త 2 days ago

SBI strike : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

వారాంతపు సెలవులు, బక్రీద్ పండుగతో కలిపి వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది.

వరుసగా ఐదు రోజుల సెలవులు

మే 23న నాలుగో శనివారం, మే 24న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. మే 25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె కొనసాగనుంది. మే 27న బక్రీద్ పండుగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

సమ్మెకు ప్రధాన కారణాలు

ఆలిండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ సమ్మె చేపడుతున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ, క్లర్కులు మరియు సాయుధ గార్డుల నియామకం, అవుట్‌సోర్సింగ్ విధానాన్ని నిలిపివేయడం వంటి డిమాండ్లతో ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కూడా వారు కోరుతున్నారు.

ఖాతాదారులకు కీలక సూచనలు

బ్యాంకింగ్ సేవల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున కస్టమర్లు ముందుగానే తమ లావాదేవీలు (SBI strike) పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. నగదు అవసరాల కోసం ఏటీఎంలను వినియోగించుకోవాలని, యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను ఉపయోగించాలని కోరింది. అత్యవసర సేవలు కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ యాజమాన్యం తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇండియాకు కావాల్సినంత ఆయిల్ ఇస్తాం - మార్కో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha