Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cancer Atlas : క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

Cancer Atlas : క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

వార్త 4 months ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడి సహకారంతో రూపొందించిన 'ఏపీ క్యాన్సర్ అట్లాస్'ను ఆయన విడుదల చేశారు.

ఈ అట్లాస్ కేవలం గణాంకాల పట్టిక మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.9 కోట్ల మంది ప్రజలకు నిర్వహించిన స్క్రీనింగ్ వివరాలను డిజిటల్ మ్యాపింగ్ చేసిన ఒక బృహత్తర ప్రాజెక్టు. దీని ద్వారా ఏ ప్రాంతంలో ఏ రకమైన క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, అందుకు గల కారణాలేంటి అనే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి, తగిన వైద్య సేవలు అందించడానికి మార్గం సుగమం అవుతుంది.

Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు - తమిళనాడు కాంగ్రెస్

దేశ ఆరోగ్య రంగ చరిత్రలోనే తొలిసారిగా క్యాన్సర్‌ను 'నోటిఫైబుల్ డిసీజ్' (Notifiable Disease) గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అంటే, రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ఆసుపత్రిలోనైనా క్యాన్సర్ కేసు నమోదైతే వెంటనే దాని వివరాలను ప్రభుత్వానికి నివేదించడం తప్పనిసరి అవుతుంది. దీనివల్ల వ్యాధి తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కాకుండా, బాధితులకు సకాలంలో ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడవచ్చు. 2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, చికిత్సను సామాన్యులకు చేరువ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

గ్రామ స్థాయి నుంచే క్యాన్సర్ గుర్తింపు మరియు చికిత్స అందేలా ప్రభుత్వం ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందిస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి, బాధితులను పెద్దాసుపత్రులకు తరలించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా వ్యాధి రాకుండా నివారించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. డాక్టర్ నోరి వంటి నిపుణుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీని దేశానికే రోల్ మోడల్‌గా నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha