దేశవ్యాప్తంగా ఉన్న CBSE తన అనుబంధ పాఠశాలల్లో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫార్సులకు అనుగుణంగా పాఠ్యాంశాల నిర్మాణంలో భారీ మార్పులు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుండి 9, 10వ తరగతి విద్యార్థులకు త్రీ-లాంగ్వేజ్ (మూడు భాషల) విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడం, భారతీయ సంస్కృతి, భాషలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా బోర్డు ఈ సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది.
Read Also : వచ్చే ఏడాది నుండి నీట్ యూజీ ఆన్‌లైన్ పరీక్షలు.. పేపర్ లీక్ దర్యాప్తులో సంచలన విషయాలు!

రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. విదేశీ భాషకూ లభించిన అవకాశం!
ఈ నూతన విధానం ప్రకారం, 9 మరియు 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి ఇకపై కనీసం మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన నిబంధనను చేర్చింది CBSE. విద్యార్థులు ఎంచుకునే ఆ మూడు భాషలలో ఖచ్చితంగా రెండు భారతీయ భాషలు ఉండాలి. మిగిలిన ఒక భాషగా విద్యార్థులు తమకు నచ్చిన ఏదైనా ఒక విదేశీ భాషను (Foreign Language) ఐచ్ఛికంగా ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల విద్యార్థులకు స్థానిక, జాతీయ భాషలతో పాటు అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేందుకు అద్భుతమైన వేదిక లభిస్తుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.
బోర్డు పరీక్షల భారం లేదు.. విద్యార్థులకు సిబిఎస్ఈ పెద్ద ఊరట!
సాధారణంగా అదనంగా ఒక భాషను నేర్చుకోవాలీ అంటే విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే, ఈ విషయంలో CBSE విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. విద్యార్థులపై ఎలాంటి మానసిక భారం పడకుండా ఉండేందుకు గాను.. పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఈ మూడో లాంగ్వేజీని చేర్చకూడదని బోర్డు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అంటే, విద్యార్థులు ఈ అదనపు భాషను అంతర్గత మూల్యాంకనం (Internal Assessment) ద్వారా కేవలం నేర్చుకుంటే సరిపోతుంది కానీ, బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్త భాషలను నేర్చుకునేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

