Dailyhunt
CBSE టెన్త్ ఫలితాల అప్డేట్

CBSE టెన్త్ ఫలితాల అప్డేట్

వార్త 1 week ago

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి మొదటి సెషన్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా సుమారు 8 వేల సెంటర్లలో పకడ్బందీగా జరిగిన ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు 'డిజీ లాకర్' (DigiLocker) ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : Amaravati quantum : ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం

రెండు సెషన్లలో పరీక్షలు

ఈ విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ ఒక కీలక మార్పును ప్రవేశపెట్టింది. గతంలో ఏడాదికి ఒకేసారి జరిగే బోర్డు పరీక్షలను ఇప్పుడు రెండు సెషన్లుగా (Session-1 & Session-2) విభజించారు. మొదటి సెషన్ రాయడం ప్రతి విద్యార్థికి తప్పనిసరి. అయితే, మొదటి సెషన్‌లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని వారు లేదా తమ ఫలితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి (Improvement) అని భావించే వారు రెండో సెషన్ రాసే అవకాశాన్ని బోర్డు కల్పించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ 'ద్వి-వార్షిక' (Biannual) విధానాన్ని తీసుకొచ్చారు.

మే 15 నుంచి రెండో సెషన్ పరీక్షలు

తొలి సెషన్ ఫలితాలు అందిన వెంటనే విద్యార్థులు రెండో సెషన్ కోసం సిద్ధం కావచ్చు. షెడ్యూల్ ప్రకారం, మే 15 నుండి జూన్ 1 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండో సెషన్‌లో మార్కులు పెరిగితే, అవే ఫైనల్ ఫలితాలుగా పరిగణించబడతాయి. ఒకవేళ స్కోరు తగ్గితే, మొదటి సెషన్ మార్కులనే ప్రామాణికంగా తీసుకునే వెసులుబాటు విద్యార్థులకు ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు తమ గ్రేడ్లను మెరుగుపరుచుకునే చక్కని అవకాశం లభించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సూర్యవంశీ విధ్వంసం.. 8 ఓవర్లకే RR 129/1

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha