Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కళ్లు, జోడెద్దుల వంటివని రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెంచేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వినూత్న సంస్కరణల ఫలితంగానే నేడు వేలాది మంది విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను వీడి సర్కారీ బడుల్లో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి మాటల స్ఫూర్తి - నైతిక విలువల బోధన
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన అమూల్యమైన మాటలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గుర్తుచేసుకున్నారు. “అమ్మకు చెప్పలేని ఏ పనినీ సమాజంలో చేయకూడదు” అని చాగంటి గారు చెప్పిన గొప్ప సత్యాన్ని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అలవరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తితోనే పాఠశాలల్లో విద్యార్థులకు సన్మార్గం, నైతిక విలువలు మరియు ముఖ్యంగా మహిళలను గౌరవించే సంస్కృతిని నేర్పిస్తున్నామని చెప్పారు. భావి భారత పౌరులుగా ఎదిగే పిల్లలు ఉత్తమ ప్రవర్తన, సామాజిక బాధ్యత కలిగి ఉండేలా విద్యావ్యవస్థలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. 'ఎట్ హోమ్' కార్యక్రమానికి గైర్హాజరు

