Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో పవన్ - బండ్ల గణేష్

చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో పవన్ - బండ్ల గణేష్

వార్త 3 days ago

Pawan Kalyan: టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆయనకు పవన్ కళ్యాణ్‌పై ఉన్న విపరీతమైన అభిమానమే.

అనేక వేదికలపై, ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్‌పై తనకున్న ప్రేమని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ "మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్" అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్‌లు సోషల్ మీడియాలో ఎప్పటికీ నిలిచిపోయే రేంజ్ గుర్తింపు సంపాదించుకున్నాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్-బండ్ల గణేష్ మధ్య అత్యంత ఆప్త బంధం ఉండేది. పవన్ హీరోగా బండ్ల నిర్మాణంలో 'తీన్‌మార్', 'గబ్బర్ సింగ్' వంటి చిత్రాలు రూపొందాయి.

అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లలో బండ్ల గణేష్ ఎక్కడా కనిపించకపోవడం, ఇద్దరూ కలిసి బహిరంగంగా ఎక్కడా ఫ్రేమ్ షేర్ చేసుకోకపోవడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు. బండ్ల గణేష్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ అనుమానాలకు తావిచ్చాయి. దీంతో మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు కలిసి కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారు.

Pawan Kalyan: 'Mega 158' వేదికగా కలిసిన పవన్ - బండ్ల గణేష్

ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ ఒకే వేదికపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సంచలన దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మెగా 158' పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఇదే ఈవెంట్‌కు బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో నిలబడి బండ్ల గణేష్ ఫోటోలు దిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయంగా బండ్ల గణేష్ భుజంపై చేయి వేసి మాట్లాడిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ ఈవెంట్‌లో చిరంజీవి కూడా బండ్ల గణేష్‌తో ఎంతో సరదాగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పక్కన బండ్ల గణేష్ అంత ఆప్యాయంగా కనిపించడంతో, "పవన్ - బండ్ల బాండింగ్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది భయ్యా.." అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మోహన్ లాల్ 'దృశ్యం 3' మూవీ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha