Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తీవ్ర వివాదాస్పదమైన 'కాంతార' మిమిక్రీ వివాదం ఎట్టకేలకు ముగిసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ మంగళవారం ఆయన మైసూర్ లోని ప్రసిద్ధ చాముండి కొండపై కొలువై ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రణ్‌వీర్, తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ పరిణామంతో గత కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదానికి పూర్తిగా తెరపడింది.
ranveer singh apologizes at chamundeshwari temple
అసలేం జరిగిందంటే..?
కొన్ని నెలల క్రితం గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో (IFFI) ఈ వివాదానికి బీజం పడింది. కన్నడ సంచలన చిత్రం ‘కాంతార’లోని అత్యంత పవిత్రమైన ‘దైవ కోల’ పాత్రను రణ్‌వీర్ సింగ్ ఎగతాళి చేస్తూ అనుకరించారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడే ఉన్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి వారించినప్పటికీ రణ్‌వీర్ వినకుండా మిమిక్రీని కొనసాగించడంపై కన్నడిగులు, దైవ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను దెబ్బతీశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Read also:Devi Sri Prasad : ఎల్లమ్మ చిత్రానికీ సరే చెప్పడానికి ప్రదానం కారణం అదే - దేవి శ్రీ
Ranveer Singh: కోర్టు తీర్పు.. షరతుతో కూడిన ఉపశమనం!
ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో న్యాయస్థానం రణ్‌వీర్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. అయితే, రణ్‌వీర్ సింగ్ కోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో ఆయనపై ఉన్న ఎఫ్‌ఐఆర్ (FIR)ను న్యాయస్థానం కొట్టివేసింది. కాకపోతే, ఒక షరతు విధించింది. నాలుగు వారాల వ్యవధిలోగా కర్ణాటకలోని చాముండేశ్వరి దేవి ఆలయానికి వెళ్లి, అమ్మవారి సమక్షంలో ప్రాయశ్చిత్త పూజలు చేసుకోవాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను పాటిస్తూ మంగళవారం ఆలయానికి వచ్చిన రణ్‌వీర్, సాంప్రదాయ పద్ధతిలో పూజలు ముగించుకోవడంతో ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

