Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఛార్‌ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి

ఛార్‌ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి

వార్త 1 week ago

Chardham Yatra 2026: ఉత్తరాఖండ్‌లో ఎంతో ఘనంగా జరిగే ఛార్‌ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. యాత్ర మొదలైన 26 రోజుల్లోనే మొత్తం 38 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.

ఏప్రిల్ 19న ప్రారంభమైన ఈ పవిత్ర యాత్రకు భక్తులు పోటెత్తారు. కానీ మారుతున్న వాతావరణం, ఆరోగ్య సమస్యల వల్ల యాత్రికులు ప్రాణాలు విడుస్తున్నారు. భక్తులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

 Chardham Yatra pilgrims safety updates

Chardham Yatra 2026: క్షేత్రాల వారీగా మరణాల వివరాలు

ఈ ఏడాది యాత్రలో కేదార్‌నాథ్ క్షేత్రంలో అత్యధికంగా 21 మంది చనిపోయారు. బద్రీనాథ్‌లో ఏడుగురు, గంగోత్రి అలాగే యమునోత్రిలలో ఐదుగురు చొప్పున భక్తులు మరణించారు. చలి తీవ్రత పెరగడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులే ఈ మరణాలకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతున్న భక్తుల రద్దీ – భద్రతా ఏర్పాట్లు

ప్రమాదాలు జరుగుతున్నా భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. బుధవారం సాయంత్రం సమయానికి సుమారు 11.81 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. యాత్రకు వచ్చే వారు వయసు, పాత జబ్బులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. కొండ ప్రాంతాల్లో నడిచేటప్పుడు అలసట రాకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. భక్తుల కోసం క్షేత్రాల వద్ద వైద్య సదుపాయాలను అధికారులు అధికం చేసారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కేరళ సీఎంగా సతీషన్ ఖరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha