Education, Skill : దేశం వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలోకి అడుగులు వేస్తున్నప్పటికీ, విద్యను ఉపాధితో అనుసం ధానించడంలో ఉన్న సవాళ్లు యువత భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒకవైపు ఉన్నత విద్యకు ప్రాధాన్యం పెరుగుతుండగా.. మరోవైపు చదువు పూర్తయిన తర్వాత తగిన ఉద్యోగం లభించకపోవడం, నైపుణ్యాలకు సరిపడే అవకాశాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. దీంతో విద్యకు ఖర్చు పెరుగుతున్నా.. విద్యకు తగ్గ ఉపాధి అవకా శాలు ఎంతవరకు అందుతున్నాయన్న ప్రశ్న ముందుకు వస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎ.ఎస్) 2025 ప్రకారం 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగిత రేటు 9.9 శాతంగా ఉంది. గ్రామీణ యువతలో 8.3శాతం ఉండగా, పట్టణ ప్రాంతా ల్లో 13.6 శాతంగా నమోదైంది. యువతలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోసం పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2025లో మాధ్యమిక విద్య లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత 6.5 శాతంగా ఉంది. 2024లో నమోదైన 7 శాతంతో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ, విద్యా వంతుల ఉపాధి సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు భావిం చలేమని నిపుణుల విశ్లేషణలు సూచిస్తున్నాయి.
Education, Skill
Education, Skill : ప్రైవేటు పాఠశాలల్లో వ్యత్యాసం
అంతర్జా తీయ కార్మిక సంస్థ (ఐఎల్) కూడా భారతదేశంలో యువతలో విద్యాస్థాయి పెరుగుతున్నప్పటికీ, వారి విద్యా అర్హతలకు సరిపోయే ఉపాధి అవకాశాల సృష్టి అంత వేగంగా జరగడం లేదని తన (ఇండియన్ ఎంప్లాయిమెంట్ రిపోర్టు) 2024లో పేర్కొంది. నైపుణ్యాలు, ఉద్యోగానికి అవసరమైన సామర్థ్యాల మధ్య అంతరం కూడా సమస్య గా ఉందని నివేదిక విశ్లేషించింది. దేశంలో విద్యా ప్రాప్తి విస్తరించినప్పటికీ, విద్యా నాణ్యతలో సమానత్వం ఇంకా ప్రధాన సవాలుగానే ఉంది. ఎఎస్ఐఆర్ 2024 ప్రకారం గ్రామీణ భారతదేశంలో పాఠశాలల్లో చేరిక రేట్లు 6-14 ఏళ్ల వయసులో 98.1 శాతంగా ఉన్నాయి. అయితే చద వడం, గణితం వంటి ప్రాథమిక సామర్ధ్యాల్లో విద్యార్థుల మధ్య ఇంకా తేడాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల ల్లో అభ్యసన స్థాయిలు మెరుగుపడుతున్నప్పటికీ, ప్రైవేటు పాఠశాలల్లో వ్యత్యాసం పూర్తిగా తొలగి పోలేదని నివేదిక వెల్లడించింది. అందువల్ల పిల్లలను పాఠశాలలో చేర్పించ డం మాత్రమే కాదు వారు ఏం నేర్చుకుంటున్నారు. ఆ విద్య భవిష్యత్తులో వారికి ఏ నైపుణ్యాలను అందిస్తోంది అన్నదే కీలకం. సాంప్రదాయ విద్యా విధానంలో డిగ్రీ, పీజీ, పరిశోధన వంటి విద్యార్హతలు సాధించడం మాత్రమే విజయానికి మార్గంగా భావించే పరిస్థితి నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. ఆధునిక పరిశ్రమలకు అవసర మైన సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్ధ్యా లు, వృత్తివిద్య వంటి అంశాలను విద్యలో మరింత బలంగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. అదే సమ యంలో ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగాన్నే లక్ష్యంగా పెట్టుకునే పరిస్థితి కూడా మారాలి.
Education, Skill
విద్యా వ్యవస్థను ఉపాధి మార్కెట్తో అనుసంధానం చేయ డం
ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామిక రంగం, చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు, సేవా రంగం, స్టార్టప్లు, స్థానిక ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం పెరగాలి. చదువు పూర్త యినా ఉపాధి దొరకకపోవడం యువతలో నిరాశకు కారణ మయ్యే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు లేకపోవడం కేవలం వ్యక్తిగత ఆర్ధిక సమస్య మాత్రమే కాదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థిరత్వం, యువత భవిష్యత్తు వంటి అంశాలపైనా ప్రభావం చూపే సమస్య. అందుకే విద్యా వ్యవస్థను ఉపాధి మార్కెట్తో అనుసంధానం చేయ డం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం, గ్రామీణ యువతకు స్థానికంగా ఉపాధి అవకా శాలు కల్పించడం, స్వయం ఉపాధికి ఆర్థిక, సాంకేతిక సహ కారం అందించడం అత్యవసరం. భారతదేశానికి విస్తారమై న యువ జనాభా ఒక గొప్ప అవకాశమైతే, వారికి నాణ్య మైన విద్య, నైపుణ్యాలు, గౌరవప్రదమైన ఉ పాధి కల్పించ డం పెద్ద బాధ్యత, సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారు తున్న నేపథ్యంలో విద్యావిధానం కూడా అదే వేగంతో మారాల్సిన అవసరం ఉంది. విద్య కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా జీవితానికి ఉపయోగపడే జ్ఞానం, నైపుణ్యం, ఉపాధి కల్పించే సాధనంగా మారాలి. యువతకు అవకాశాలు కల్పిస్తేనే జనాభాశక్తి ఆర్థికశక్తిగా మారుతుంది. లేకపోతే అదే జనాభా ఒత్తిడిగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే దేశం ముందుకు సాగాలంటే విద్యానాణ్యత, నైపుణ్యాభి వృద్ధి, ఉ పాధిసృష్టి, పారిశ్రామికాభివృద్ధి అనేనాలుగుఅంశా లను సమన్వయంతో ముందుకుతీసుకెళ్లాలి. యువతకు చదువు మాత్రమేకాదు చదువుకు తగ్గభవిష్యత్తు కావాలి.
-లింగప్రసాద్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

