Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనాతో పెట్టుకుంటే రక్షించలేమంటూ ఓపెన్ స్టేట్మెంట్!

చైనాతో పెట్టుకుంటే రక్షించలేమంటూ ఓపెన్ స్టేట్మెంట్!

వార్త 3 months ago

Donald Trump Taiwan Comments: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటన ముగిసిన వెంటనే తైవాన్ దేశాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చైనా అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, దానితో తైవాన్ ఘర్షణ పడటం సరికాదని హితవు పలికారు. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే, అమెరికా అంత దూరం (సుమారు 15 వేల కిలోమీటర్లు) ప్రయాణించి తైవాన్‌ను కాపాడటం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదంటూ ఒక రకంగా అమెరికా సైనిక జోక్యంపై చేతులెత్తేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించి చైనా ఆగ్రహానికి గురికావద్దని ఆయన సూచించారు.

Read Also:PM Modi in Netherlands : ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

Donald Trump Taiwan Comments:15 వేల కిలోమీటర్లు వచ్చి యుద్ధం చేయలేం

ఇదే సమయంలో తైవాన్ గ్లోబల్ చిప్ మార్కెట్‌ను శాసిస్తుండటంపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన చిప్ ఇండస్ట్రీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునే తైవాన్ ఇంతటి భారీ స్థాయికి ఎదిగిందని ఆయన ఆరోపించారు. అమెరికా రక్షణ కవచంపై పూర్తిగా ఆధారపడుతున్న తైవాన్‌కు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద షాక్‌గా మారగా, చైనా పట్ల ట్రంప్ అనుసరిస్తున్న సరికొత్త వ్యూహాత్మక వైఖరికి ఇవి అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

"భారతదేశ ప్రజలలో వైవిధ్య సంస్కృతి జీవిస్తూనే ఉంది": మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha