Sugar : ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు టీతో రోజును ప్రారంభించే ప్రతి భారతీయుడి జీవితంలో చక్కెరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో అతిథి వస్తే టీ, పండు గ అయితే పాయసం, పుట్టినరోజు అయితే కేక్, శుభవార్త అయితే స్వీట్లు ప్రతి ఆనందంలో చక్కెరే తీపిని నింపు తుంది.
అలాంటి చక్కెర ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో విలాస వస్తువులా మారుతోంది. ఒకప్పుడు నిత్యావసర సరుకుల జాబితాలో నిశ్శబ్దంగా ఉండే చక్కెర, నేడు దేశ ఆర్థిక విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న అతిపెద్ద చర్చ నీయాంశంగా నిలిచింది. కిలో రూ.45 వద్ద లభించిన చక్కెర ధర ఒక్కసారిగా రూ.65 దాటడం వెనుక కేవలం మార్కెట్లో సహజ కొరత మాత్రమే కాదు, ప్రభుత్వ ఇథ నాల్ విధానం, మిల్లు యజమానుల వ్యాపార ప్రయోజ నాలు, వాతావరణ అనిశ్చితి, ఆహార భద్రత పట్ల నిర్లక్ష్యం కలిసి ఈ సంక్షోభాన్ని సృష్టించాయి. దేశంలో చక్కెర కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం చెరకు రసం, బిహెవీ మొలాసెన్న భారీగా ఇథనాల్ తయారీకి మళ్లించడమే. చమురు దిగుమతులను తగ్గించి పెట్రోల్లో ఇథనాల్ కల పాలన్న లక్ష్యంతో L ప్రభుత్వం ముందుకెళ్లినప్పటికీ, దేశీయ ఆహార అవసరాలను సరిగా అంచనా వేయడంలో విఫల మైంది. దాదాపు 35 నుంచి 45 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తికి సమానమైన చెరకు రసం ఇథనాల్ కర్మాగారా లకు మళ్లిపోవడంతో మార్కెట్లో చక్కెర నిల్వలు గణనీ యంగా తగ్గిపోయాయి. ఇంకోవైపు చక్కెర అమ్మకాలకంటే ఇథనాల్ సరఫరా ద్వారా చమురు కంపెనీల నుంచి వేగం గా, స్థిరంగా నగదు రావడం మిల్లు యజమానులకు మరింత లాభదాయకంగా మారింది. ఫలితంగా వారు చక్కెర ఉత్పత్తి కంటే ఇథనాల్ తయారీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆహార భద్రత కంటే వ్యాపార లాభాలకే ప్రాధా న్యం దక్కిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయాలపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన చెరకు ఉత్పత్తి రాష్ట్రాల్లో వాతావ రణ మార్పుల కారణంగా దిగుబడులు తగ్గే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు వచ్చినప్పటికీ, ఇథనాల్ మళ్లింపుపై సమ యానికి నియం త్రణలు విధించ లేదు.
Sugar
Sugar : ప్రతి ఇంటి నెల వారీ ఖర్చు పెరగడం
ధరలు సామాన్యుడి అందుబాటును దాటిన తర్వాత మాత్రమే స్టాక్ పరిమితులు, దిగుమతి సుంకా ల సడలింపు వంటి చర్యలు తీసుకోవడం వల్ల మధ్యవర్తులు, నిల్వ దారులు కోట్ల రూపాయలు ఆర్జించగా, వినియోగదారుడు మాత్రం భారాన్ని మోయాల్సి వచ్చింది. మరోవైపు చెరకు రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎరు వులు, డీజిల్, కూలీల ఖర్చులు విపరీతంగా పెరగడం, ఎల్సినో ప్రభావంతో దిగుబడి, నాణ్యత తగ్గిపోవడం రైతును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రభుత్వం ప్రకటిం చిన పోత్సాహ కాల అసలు లాభం మిల్లు యజమాను లకు, వ్యాపార వర్గాలకే ఎక్కువగా చేరింది. పంట పండించిన రైతుకు మాత్రం తగిన మద్దతు ధర, స్థిరమైన ఆదాయం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రతి ఉదయం ఒక కప్పు టీతో మొదలయ్యే సామాన్యుడి జీవి తంపై ఇలాంటి నిర్ణయాలు నేరుగా ప్రభావం చూపుతు న్నాయి. చక్కెర ధర పెరగడం అంటే కేవలం టీ తీపి తగ్గిపోవడం కాదు, ప్రతి ఇంటి నెల వారీ ఖర్చు పెరగడం, చిన్న స్వీట్లు కూడా ఆలోచించి కొనాల్సిన పరిస్థితి రావ డం. దేశ ఇంధన భద్రత పేరుతో ప్రజల ఆహార భద్రతను పణంగా పెట్టడం ఏ ప్రభుత్వానికీ సమర్ధించదగిన ఆర్ధిక విధానం కాదు.
Sugar
చెరకు రసంనుంచి ఇథనాల్ తయారీ
ఒక వైపు పెట్రోల్లో ఇథనాల్ కలిపి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్నామని చెప్పుకుంటూ, మరోవైపు అదే నిర్ణయంతో కోట్లాది కుటుంబాల వం టింటిపై అదనపు భారం మోపడం అభివృద్ధి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం దూర దృష్టితో వ్యవహరించాలి. దేశీయ చక్కెర నిల్వలు తగ్గే ప్రమాదం కనిపించిన ప్రతిసారీ నేరుగా చెరకు రసంనుంచి ఇథనాల్ తయారీపై కఠిన నియంత్రణలు అమలుచేయాలి. పండుగల సీజన్, అధిక డిమాండ్ ఉన్న కాలాల్లో ఇథనాల్ మళ్లింపును తగ్గించి, నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్ర మే పెంచే సౌకర్యవంతమైన విధానాన్ని రూపొందించాలి. రైతుకు గిట్టుబాటు ధర, మిల్లులకు స్థిరమైన వ్యాపారం, వినియోగదారుడికి అందుబాటు ధర ఈ మూడు లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించినప్పుడే నిజమైన విజయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ అభివృద్ధి అంటే పెట్రోల్ ట్యాంక్ నిండడమే కాదు, ప్రతి ఇంట్లో ఉదయం టీ కప్పు లో తీపి తగ్గకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. సామాన్యుడి కప్పులోని తీపిని కాపాడినప్పుడే ప్రభుత్వ విధానాలకు నిజమైన తీపి అర్థం వస్తుంది.
-కాలగిరీశ్రీనివాస్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
బీహార్‌లో భారీ చేపల కలకలం.. తింటే ముప్పేనని ప్రభుత్వం హెచ్చరిక!

