Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చల్ల అన్నం తింటే ఆరోగ్యానికి మేలు: నిపుణులు

చల్ల అన్నం తింటే ఆరోగ్యానికి మేలు: నిపుణులు

వార్త 3 weeks ago

Health Tips: దక్షిణ భారతదేశంలో నిత్య జీవితంలో అన్నం తినే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, సాధారణంగా ఎప్పుడూ తినే వేడి వేడి అన్నం కంటే కొద్దిగా చల్లబడిన అన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అన్నం వండిన వెంటనే వేడిగా తినడం కంటే, దానిని కాస్త చల్లార్చడం లేదా రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని పోషక విలువలు అందుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

రెసిస్టెంట్ స్టార్చ్‌గా మార్పు – జీర్ణశక్తి మెరుగుదల

అన్నాన్ని చల్లార్చినప్పుడు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టినప్పుడు అందులోని స్టార్చ్ రూపం మారి ‘రెసిస్టెంట్ స్టార్చ్‌’గా మారుతుంది. ఈ ప్రత్యేకమైన రెసిస్టెంట్ స్టార్చ్ మన శరీరంలో జీర్ణశక్తిని గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, నిత్యం వేధించే మలబద్ధకం మరియు అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలను సమర్థవంతంగా తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Health Tips: శరీర ఉష్ణోగ్రత నియంత్రణ – వడదెబ్బ నుంచి రక్షణ

సాప్రదాయ పద్ధతిలో తయారయ్యే చద్దన్నం తినడం వల్ల శరీరం లోపలి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చద్దన్నం తీసుకోవడం ద్వారా శరీరం చల్లబడి వడదెబ్బ తగలకుండా చక్కటి రక్షణ లభిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలోనూ ఈ చల్లటి అన్నం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

రోగులకు బ్రెడ్ ఎందుకు తినమంటారు ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha