Sheikh Hasina: రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో తలెత్తిన తీవ్ర ప్రజా తిరుగుబాటుతో పదవీచ్యుతురాలై, దేశం విడిచి వచ్చి భారత్‌లో శరణార్థిగా తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
త్వరలోనే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని ఇప్పటికే ప్రకటించిన ఆమె.. తాజాగా తన తిరుగు ప్రయాణ కాలక్రమం (Timeline) పై పూర్తి స్పష్టత ఇచ్చారు. రాబోయే డిసెంబర్ నెలలో తాను బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు హసీనా వెల్లడించారు. తనతో పాటు విదేశాల్లో తలదాచుకుంటున్న అవామీ లీగ్ (Awami League) పార్టీ కీలక నేతలు కూడా స్వదేశానికి తరలివస్తారని స్పష్టం చేశారు.
అరెస్టు చేసినా.. చంపేసినా వెనక్కి తగ్గేదే లేదు

స్వదేశానికి వెళ్తే అక్కడ ఎదురయ్యే తీవ్ర పరిణామాలపై షేక్ హసీనా పూర్తి అవగాహనతో ఉన్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. “నేను బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టగానే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టవచ్చు లేదా చంపేయవచ్చు. అయినా నేను వెనక్కి తగ్గను. ఒకవేళ నాకు చావు అంటూ వస్తే అది నా సొంత గడ్డపైనే రావాలి. నా తల్లిదండ్రులు దేశం కోసం రక్తం చిందించిన చోటే నా ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నాను” అని హసీనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న తమ పార్టీ శ్రేణులు, అవామీ లీగ్ నాయకులు తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని, వేధింపులను ఎదుర్కొంటున్నారని.. వారిలో ధైర్యం నింపేందుకైనా తాను వెళ్లక తప్పదని ఆమె పేర్కొన్నారు.
Sheikh Hasina: వెంటాడుతున్న మరణశిక్ష ముప్పు
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో కోటా సంస్కరణల నేపథ్యంలో చెలరేగిన విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని షేక్ హసీనా ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఆమెకు ఉరితాడుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. నాటి ఘర్షణల్లో వందలాది మంది విద్యార్థుల మరణానికి హసీనా పరోక్షంగా కారణమయ్యారని, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT) లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆమెను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు చట్టపరమైన ఉచ్చు, మరోవైపు ప్రాణభయం ఉన్నప్పటికీ హసీనా స్వదేశానికి వెళ్లడానికే మొగ్గు చూపడం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌కు భారత్ సన్నద్ధం: మెల్బోర్న్ వేదికగా ప్రధాని మోదీ

