Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చమురు ధరలు షాక్ ఇవ్వొచ్చు.. గీతా గోపీనాథ్ హెచ్చరిక

చమురు ధరలు షాక్ ఇవ్వొచ్చు.. గీతా గోపీనాథ్ హెచ్చరిక

వార్త 2 days ago

Crude oil prices : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ హెచ్చరించారు.

అంతర్జాతీయ పరిస్థితులు మరింత దిగజారితే దేశంలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలపై భారీ ఒత్తిడి పడొచ్చని ఆమె పేర్కొన్నారు.

చమురు ధరలపై ఆందోళన

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని గీతా గోపీనాథ్ తెలిపారు. అదే జరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చులు, పరిశ్రమల తయారీ వ్యయాలు కూడా పెరిగి ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత అధికమయ్యే ప్రమాదం ఉందన్నారు.

హోర్ముజ్ జలసంధి ప్రభావం

ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ సరఫరా అంతరాయం ఏర్పడితే భారత్‌కు వచ్చే చమురు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ, ఎరువుల సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉందన్నారు.

Read Also ; 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్‌లైన్

 Crude oil prices

భారత్‌కు ఉన్న రక్షణ వ్యవస్థ

ఇలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్ పూర్తిస్థాయి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశం తక్కువేనని గీతా గోపీనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయ డిమాండ్, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడులు, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు దేశానికి ప్రధాన రక్షణ కవచాలుగా పనిచేస్తాయని ఆమె తెలిపారు. ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి పెట్టడం ఇప్పుడు ముఖ్యమని సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇండియాకు కావాల్సినంత ఆయిల్ ఇస్తాం - మార్కో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha