Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబు కు భయం పట్టుకుంది - రోజా

చంద్రబాబు కు భయం పట్టుకుంది - రోజా

వార్త 4 days ago

AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇప్పటివరకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు, వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తును చూసి భయపడిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన జగన్ కౌన్సిలర్ అభ్యర్థులను చూసి కూడా వణికిపోతోందని ఆమె వ్యాఖ్యానించారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఈవీఎం (EVM)ల అక్రమాలతో గెలిచారని, కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుండటంతో అసలు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని ఆమె ఆరోపించారు. బ్యాలెట్ విధానంలో అవకతవకలకు తావుండదనే ఈ భయాందోళనలు కూటమి నాయకుల్లో కనిపిస్తున్నాయని రోజా పేర్కొన్నారు.

Read ALso ; రాజంపేట మున్సిపాలిటీ ఏకగ్రీవం!

నామినేషన్ల వేళ అధికారుల తీరుపై హెచ్చరిక: తిరిగి అధికారంలోకి వచ్చాక చర్యలు ఖాయం

నామినేషన్ల ప్రక్రియలో అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల తీరుపై మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అధికార పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న అధికారులను తాము నిశితంగా గమనిస్తున్నామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తూ కూటమి నాయకులకు సహకరిస్తున్న అధికారులపై రేపు తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకే మద్దతుగా నిలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

విజయవాడలో రేపు గ్రాండ్ కార్నివాల్.. హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha