Chandrababu Naidu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెప్టెంబర్ 1, 1995 ఒక కీలకమైన రోజు. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ నుండి అధికారాన్ని చేజిక్కించుకుని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన పాలనను ప్రారంభించారు. నాటి నుండి 2004 వరకు సుమారు తొమ్మిదేళ్ల పాటు ఏకధాటిగా సీఎంగా కొనసాగి రికార్డు సృష్టించారు.
Read also: Rathod Bapurao: తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!

CBN Political Journey 1995 to 2024
Chandrababu Naidu: తిరుగులేని మెజారిటీతో మళ్ళీ సీఎంగా
1999 ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లిన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2004లో వచ్చిన రాజకీయ మార్పుల వల్ల పదేళ్ల పాటు అధికారానికి దూరమై ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నం చేశారు.
2024 అఖండ విజయం
2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, పట్టువదలకుండా పోరాడి 2024లో మళ్ళీ బీజేపీ మరియు జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడంతో భారీ మెజారిటీతో విజయం సాధించి నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి మరియు అనుభవజ్ఞుడైన నాయకుడిగా ఏపీని మరోసారి అగ్రపథాన నిలిపేందుకు ఆయన కృషి చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

