Chandragiri Sports Center: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, దివంగత నారా రామ్మూర్తినాయుడు స్మారకార్థం తిరుపతి జిల్లా చంద్రగిరిలో నిర్మించిన అత్యాధునిక క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి నారా లోకేశ్ ఘనంగా ప్రారంభించారు.చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రారంభించిన లోకేశ్… ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు.

