Dailyhunt
చంద్రుడిపై ప్లాట్ల అమ్మకాలు..ఇప్పటికే రూ. 100 కోట్లు సంపాదించారు !!

చంద్రుడిపై ప్లాట్ల అమ్మకాలు..ఇప్పటికే రూ. 100 కోట్లు సంపాదించారు !!

వార్త 1 week ago

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్టెమిస్-2 ప్రయోగం విజయవంతమై వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడంతో అందరి చూపు చంద్రుడిపై పడింది.

సరిగ్గా ఇదే సమయంలో అమెరికాకు చెందిన డెన్నిస్ హోప్ అనే వ్యక్తి పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. 1980వ దశకంలోనే ఆయన చంద్రుడిని తన సొంత ఆస్తిగా ప్రకటించుకుని, అక్కడ ప్లాట్లు అమ్మడం మొదలుపెట్టారు. అప్పట్లో ఇది ఒక వింతగా అనిపించినా, ఇప్పటివరకు ఆయన సుమారు 70 లక్షల మందికి పైగా చంద్రుడిపై స్థలాలను విక్రయించి, రూ. 100 కోట్లకు పైగా సంపాదించడం విశేషం.

Read Also : Amaravati quantum : ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం

చట్టంలోని లొసుగులు మరియు ‘లూనార్ ఎంబసీ’

డెన్నిస్ హోప్ ఈ వ్యాపారాన్ని కేవలం గాలిలో మాటలతో మొదలుపెట్టలేదు. 1967 నాటి అంతర్జాతీయ ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ (Outer Space Treaty) లోని ఒక చిన్న లొసుగును ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ చట్టం ప్రకారం ఏ దేశమూ అంతరిక్షంలోని గ్రహాలపై లేదా ఉపగ్రహాలపై యాజమాన్య హక్కులు కలిగి ఉండకూడదు. అయితే, ఇందులో వ్యక్తుల (Individuals) గురించి స్పష్టమైన నిషేధం లేకపోవడాన్ని గమనించిన హోప్, ఐక్యరాజ్యసమితికి లేఖ రాసి చంద్రుడిపై తన హక్కును చాటుకున్నారు. ఆ తర్వాత ‘లూనార్ ఎంబసీ’ అనే సంస్థను స్థాపించి, ఎకరం కేవలం కొన్ని డాలర్లకే అమ్మడం ప్రారంభించారు.

సెలబ్రిటీల ఆసక్తి

చంద్రుడిపై స్థలాలు కొన్న వారిలో సామాన్యులే కాదు, హాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ కొనుగోళ్లకు అంతర్జాతీయంగా ఎటువంటి చట్టబద్ధత (Legal Validity) లేదు. శాస్త్రవేత్తలు మరియు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చంద్రుడు మానవాళి అందరికీ చెందుతుంది తప్ప, ఏ ఒక్క వ్యక్తి దాన్ని అమ్ముకోలేరు. అయినప్పటికీ, భవిష్యత్తులో చంద్రుడిపై నివాసం ఉండే అవకాశం ఉంటుందన్న ఆశతోనో లేదా ఒక గిఫ్ట్‌గా ఇవ్వడానికో చాలా మంది ఈ ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఏది ఏమైనా, ఆకాశంలో ఉండే చందమామపై భూమి మీద వ్యాపారం సాగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సూర్యవంశీ విధ్వంసం.. 8 ఓవర్లకే RR 129/1

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha