Dailyhunt
చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తకు షోకాజ్ నోటీసులు.. అధికారుల నిర్లక్ష్యం

చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తకు షోకాజ్ నోటీసులు.. అధికారుల నిర్లక్ష్యం

వార్త 2 weeks ago

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం పనితీరులోని లోపాలను ఎత్తిచూపుతూ ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర క్రితమే మరణించిన ఒక అంగన్‌వాడీ కార్యకర్తకు, ఆమె విధులకు గైర్హాజరవుతోందంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మహోబా జిల్లాకు చెందిన పార్వతి (49) అనే మహిళ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేసేవారు. ఆమె 2024, నవంబర్ 1వ తేదీన కన్నుమూశారు. ఆమె మరణించిన వారం రోజులకే, ఆమె భర్త కిషున్‌లాల్ సంబంధిత మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయానికి వెళ్లి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించారు. కానీ, ఆ రికార్డులను సరిచేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.

Read Also : CIO Of US Labour Department: యూఎస్ కార్మిక శాఖ సీఐఓగా భారత సంతతికి చెందిన మంగళ కుప్పా

 UP government issues show cause notice to deceased Anganwadi worker

చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) యాస్మిన్ జహాన్ సంతకం చేసిన ఈ నోటీసులో సంచలన ఆరోపణలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు అది మూసి ఉందని, దీనివల్ల 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించే పోషణ్ ట్రాకర్‌లో డేటా అప్‌డేట్ చేయడం లేదని, మధ్యాహ్న భోజన పథకానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆ నోటీసులో తీవ్రంగా మందలించారు.

Uttar Pradesh: కుమారుడి ఆవేదన.. “స్వర్గానికి వెళ్లి అమ్మను అడుగుతా”

అధికారుల నిర్లక్ష్యంపై పార్వతి కుమారుడు మహేష్ తీవ్రంగా స్పందించారు. “ఈ నోటీసు పట్టుకుని నేను స్వర్గానికి వెళ్తాను. అక్కడ మా అమ్మను కలిసి.. గత 18 నెలలుగా నువ్వు పనికి ఎందుకు వెళ్లడం లేదు? అని అడుగుతాను” అంటూ అధికారుల తీరును ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి మరణించిన విషయం కూడా తెలియకుండా నోటీసులు పంపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఈ ఘటన కేవలం నిర్లక్ష్యమేనా లేక దీని వెనుక ఏదైనా కుంభకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్వతి మరణించిన తర్వాత గత 18 నెలలుగా ఆమె పేరు మీద విడుదలవుతున్న గౌరవ వేతనం ఎవరి ఖాతాలోకి వెళ్తోంది? రికార్డుల్లో ఆమె పనిచేస్తున్నట్లు చూపిస్తూ ఎవరో ఆ సొమ్మును కాజేస్తున్నారా? అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారుల సమర్థన

నోటీసు జారీ చేసిన CDPO యాస్మిన్ జహాన్ మాత్రం తన తప్పు ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తనిఖీ సమయంలో ఆమె లేకపోవడంతోనే నోటీసు ఇచ్చానని, ఆమె మరణించిన విషయం అంగన్‌వాడీ మేనేజర్ తనకు చెప్పాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బాధితులు ఇప్పుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

అలర్ట్.. పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha