Ramcharan : బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం ఘనవిజయం సాధించడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.
జూన్ 4న విడుదలైన ఈ సినిమా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఈ భారీ విజయం తర్వాత రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో నటించబోయే ‘RC17’ (వర్కింగ్ టైటిల్) చిత్రంపై టాలీవుడ్‌లో సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ దసరా పండుగ శుభ ముహూర్తాన ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు డిసెంబర్ నుంచి క్రమం తప్పకుండా షూటింగ్ జరుపుకోనుంది.
2028 టార్గెట్‌గా సుకుమార్ మార్క్ మేకింగ్
సుకుమార్ ఈ చిత్రాన్ని నాన్‌స్టాప్‌గా 12 నెలల్లో పూర్తి చేసి, 2028 సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా ప్రేక్షకు ముందుకు తీసుకురావడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన “రోరింగ్ టూ కాన్కర్” పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను పెంచగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలోని మొదటి ఐదు నిమిషాల ఇంట్రో సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని రాజమౌళి పేర్కొనడంతో ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

